'గని'లో తమన్నా.. బర్త్ డే విషెష్ చెబుతూ రివీల్ చేసిన టీమ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రెజెంట్ నటిస్తున్న సినిమా గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

  varun Tej Gani Team Wishes Tamannaah A Very Happy Birthday Details, Varun Tej,-TeluguStop.com

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఈ సినిమాను డిసెంబర్ 24 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా వాయిదా వేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.ఈ సినిమా లో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక తాజాగా మరొక స్టార్ ఈ సినిమాలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా నటిస్తుందని మేకర్స్ రివీల్ చేసారు.నిన్న మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తమన్నాకు బర్త్ డే విషెస్ చెబుతూ మేకర్స్ ఈ విషయాన్నీ తెలిపారు.

బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ తమన్నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.టీమ్ గని అంటూ మేకర్స్ తమన్నా ఫోటోను షేర్ చేసారు.అయితే ఈ సినిమాలో తమన్నా ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారో తెలియాల్సి ఉంది.

ఏదైనా అది కీలక పాత్ర అనే తెలుస్తుంది.మరి త్వరలోనే మరొకసారి విడుదల తేదీ ప్రకటించబోతున్నారు.

చూడాలి వరుణ్ తేజ్ కు ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube