మెగా కాంపౌండ్ లో త్వరలోనే పెళ్లి భాజలు మోగబోతున్న సంగతి మనకు తెలిసిందే.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) నటి లావణ్య త్రిపాఠి ల వివాహం ఈ ఏడాది నవంబర్ నెలలో జరగబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎలాంటి ప్రకటన తెలియజేయలేదు కానీ ఇప్పటికే ఈ జంట పెళ్లి పనులలో నిమగ్నమయ్యారు.గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) జూన్ 9వ తేదీ పెద్దల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.
ఇలా నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట ఈ ఏడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది.

ఇలా లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ పెళ్లి జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెళ్లి పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.అయితే వీరి వివాహం హైదరాబాదులో కాకుండా ఇటలీలోని ఒక ప్యాలెస్ లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుందని తెలుస్తోంది.అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని సమాచారం.
ఇక త్వరలోనే బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నటువంటి వరుణ్ తేజ్ ఘనంగా తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ( Bachelor Party ) ఇచ్చారట.అయితే ఈయన హైదరాబాదులో కాకుండా ఏకంగా స్పెయిన్( Spain ) వెళ్లి అక్కడ తన ఫ్రెండ్స్ కు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారని తెలుస్తుంది.

వరుణ్ తేజ్ దాదాపు 40 మంది స్నేహితులతో కలిసి స్పెయిన్ వెళ్లారట.ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ గ్రాండ్ గా అరెంజ్ చేసి ఎంతో ఎంజాయ్ చేశారని తెలుస్తుంది.ఇక బ్యాచిలర్ పార్టీ ముగించుకొని ఇండియా చేరుకున్న తర్వాత లావణ్య వరుణ్ ఇద్దరు కూడా పూర్తిగా పెళ్లి పనులలో బిజీ కానున్నారు.ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరిగా గని, గాండీవ దారి అర్జున సినిమా( Gandeevadhari Arjuna ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ రెండు సినిమాల్లో కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.త్వరలోనే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ తో రానున్నారు.