వరుణ్ కి జోడీగా సల్మాన్ ఖాన్ హీరోయిన్... తెలుగులో ఎంట్రీ

సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సయీ మజ్రేకర్.బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన ఘటన సల్మాన్ ఖాన్ కి దక్కుతుంది.

 Varun Tej Dabang3 Slaman Khana Heroes Sayee Manjrekar-TeluguStop.com

దబాంగ్ మొదటి సినిమాతో సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయం చేసిన సల్మాన్ లిస్టు లోడజనుకి పైగా హీరోయిన్స్ ఉంటారు.అతనితో నటించిన తర్వాత కొంత మంది భామలు స్టార్ హీరోయిన్స్ అయితే, మరికొంత మంది సినిమా సెలక్షన్ సరిగా లేకపోవడంతో కనుమరుగయ్యారు.

ఇప్పుడు అదే కోవాలో దబాంగ్ 3 ద్వారా బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ ని పరిచయం చేశారు.

ఈ సినిమాతో హీరోయిన్ గా మంచి మార్కులు వేయించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో మెగా హీరోతో నటించే అవకాశం సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.ఇక ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయిన ఫిలిం నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సయీని ఫైనల్ చేసారని తెలుస్తుంది.

ఇక తెలుగులో గ్రాండ్ ఎంట్రీ కోసం ఈ భామ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుందని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube