మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది.
శక్తి ప్రతాప్ సింగ్ అనే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో వరుణ్ తేజ్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇలా ఈయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.అయితే తాజాగా వరుణ్ తేజ్ తన అన్నయ్య రామ్ చరణ్ ( Ram Charan ) తో గొడవ పడినటువంటి సంఘటనలను ఈ ఇంటర్వ్యూల సందర్భంగా తెలియచేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపించే చరణ్ వరుణ్ తో గొడవ పడటం ఏంటి అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయానికి వస్తే.

ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ నాకు చరణ్ అన్నయ్యకు చిన్నప్పుడు తరచూ గొడవలు జరిగేవని తెలియజేశారు.చిన్నప్పుడు చిరంజీవి ( Chiranjeevi ) అలాగే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఇద్దరు కూడా పలు యాడ్స్ చేసేవారు.చరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని అని వరుణ్ చిరంజీవి అభిమాని అట పెదనాన్న చేసిన యాడ్ బాగుందని వరుణ్ అంటే లేదు బాబాయ్ చేసిన బాగుందని ఇద్దరు పెద్ద ఎత్తున గొడవపడేవారట.
చిరంజీవి ఇంట్లో ఉన్నంతవరకు తాను సేఫ్ జోన్ లో ఉండేవాడినని పెదనాన్న బయటకు వెళ్ళగానే చరణ్ అన్నయ్య నాతో ఓ ఆట ఆడుకునేవారు అంటూ ఈ సందర్భంగా చిన్నప్పుడు వారిద్దరి మధ్య జరిగే గొడవలు గురించి వరుణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







