షూటింగ్ మెదలెట్టిన రోజే రిలీజ్ డేట్ కన్ఫర్మ్! వరుణ్ బాక్సర్ మూవీ

వరుస విజయాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు.తన నెక్స్ట్ సినిమా కోసం ఏకంగా బాక్సర్ గా మారిపోయాడు.

 Varun Tej Boxer Movie Release Date Confirmed-TeluguStop.com

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.వరుణ్ తేజ్ కెరియర్ లో మరోసారి భారీ బడ్జెట్ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది.

దీనికోసం నిర్మాతలు ఏకంగా 35 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విశాఖ సాగరతీరంలో తాజాగా ప్రారంభమైంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న వరుణ్ తేజ్ తన లుక్ ని కంప్లీట్ గా మార్చుకొని షూటింగ్ కి రెడీ అయిపోయాడు.ఇక ఈ సినిమాలో సయీ మజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా కథ మొత్తం విశాఖ నేపధ్యంలో నడుస్తుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే సినిమా షూటింగ్ మొదలెట్టిన రోజే రిలీజ్ బాక్సర్ రిలీజ్ డేట్ ని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.

జులై 30న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.మరి ఇప్పటికే వరుస విజయాలతో ఉన్న వరుణ్ తేజ తాజాగా గద్దలకొండ గణేష్ సినిమాతో తనలోని మాస్ ఎలివేషన్ ని ప్రేక్షకులకి చూపించాడు.

దీంతో ఇప్పటి వరకు క్లాస్ పాత్రలకే పరిమితం అవుతాడని అనుకున్న వరుణ్ మాస్ పాత్రలకి కూడా తన పెర్ఫెక్ట్ అన్ని ప్రూవ్ చేసుకొని మరోసారి మాస్ కథాంశంతో, టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ అయిన బాక్సింగ్ స్టొరీతో ప్రేక్షకుల ముదుకి రావడానికి రెడీ అయిపోతున్నాడు.ఈ నేపధ్యంలో వరుణ్ తేజ్ లిస్టు లో మరో హిట్ గా బాక్సర్ ఉండబోతుంది అని ఫిక్స్ అయిపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube