ఫస్ట్ లుక్‌తో వరుణ్ పంచ్ అదిరింది!  

Varun Tej Boxer Movie First Look Released - Telugu Boxer Movie, First Look, Telugu Movie News, Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్‌గా నిలిచింది.కాగా వరుణ్ తన సినీ కెరీర్‌లో ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ చాలా సెలెక్టివ్‌గా ముందుకు వెళుతున్నాడు.

Varun Tej Boxer Movie First Look Released

తాజాగా వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న బాక్సర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం వరుణ్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు.

జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ తనదైన ఇంప్రెషన్ కొట్టేస్తున్నాడు.కాగా జనవరి 19న పుట్టినరోజు జరుపుకుంటున్న వరుణ్ తేజ్ తన ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు.

బాక్సర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది.ఈ పోస్టర్‌లో బాక్సర్‌గా మారిన వరుణ్ పంచ్ కొడుతూ కనిపించాడు.

చాలా రఫ్‌లుక్‌తో వరుణ్ ఈ సినిమాలో నటిస్తు్న్నాడు.

కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేష్(బాబీ) మరియు సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేస్తుండటంతో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉండటం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని ఇంకా చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.

తాజా వార్తలు

Varun Tej Boxer Movie First Look Released-first Look,telugu Movie News,varun Tej Related....