బాక్సింగ్ రింగ్ లోకి దిగిన వరుణ్ తేజ్  

Varun Tej Boxer Shooting Action Scenes, Tollywood, Telugu Cinema, South Heroes, Mega Prince, Niharika Wedding, Kiran Korrapati - Telugu Boxer Movie, Kiran Korrapati, Mega Prince, Niharika Wedding, South Heroes, Telugu Cinema, Tollywood, Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో నభా నటేష్ వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తుంది.

TeluguStop.com - Varun Tej Boxer Film Action Scenes Are Shooting

లాక్ డౌన్ కంటే ముందుగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో వాయిదా పడిన సినిమా మరల గత నుంచి స్టార్ట్ అయ్యింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇప్పటికే కీలక సన్నివేశాలని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూట్ చేశారు.

TeluguStop.com - బాక్సింగ్ రింగ్ లోకి దిగిన వరుణ్ తేజ్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తూ ఉండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత చేస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.ప్రస్తుతం మెగా ప్రిన్స్ చెల్లెల్లు నిహారికా పెళ్లి పనుల్లో ఓ వైపు బిజీగా ఉన్నాడు.

నిహారికా పెళ్లి వేడుకని డెస్టినేషన్ వెడ్డింగ్ గా ప్లాన్ చేశారు.ఈ నేపధ్యంలో అన్న వరుణ్ తేజ్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.

చెల్లెల్లు పెళ్లి బాధ్యతలు చూస్తూనే బాక్సర్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు.ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ కి సంబందించిన సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.వరుణ్ తేజ్ ఈ ఎపిసోడ్స్ లో పాల్గొన్న తర్వాత షూటింగ్ కి మళ్ళీ గ్యాప్ ఇచ్చి నిహారికా పెళ్లి వేడుక పూర్తయిన తర్వాత తిరిగి జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.ఈ లోపు దర్శకుడు వరుణ్ తేజ్ లేని సన్నివేశాలు పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్లాన్చేస్తున్నారు.ఎఫ్ 2, గడ్డలకొండ గణేష్ తో వరుస హిట్స్ తో ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు.

మరి ఆ సినిమాల స్థాయిలో బాక్సర్ ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

#Kiran Korrapati #Varun Tej #Mega Prince #South Heroes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varun Tej Boxer Film Action Scenes Are Shooting Related Telugu News,Photos/Pics,Images..