మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు.ముందు నుండి వరుణ్ తేజ్ డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు.
ఈయన సినిమా వస్తుంది అంటే ఏదొక కొత్తదనం ఉంటుంది అని ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.ప్రెజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.
మరి ఆ సినిమాల్లో వరుణ్ తేజ్ 13వ సినిమా ఒకటి.

నూతన డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్( Shakti Prathap singh ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భిన్నంగా, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది.‘VT13’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్( Manushi Chillar ) హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమాను సోనీ పిక్చర్స్ అండ్ రెనైస్సేన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈయన ఎంగేజ్మెంట్ గురించి ఇప్పుడు ఓ రేంజ్ లో వార్తలు వరుణ్ తేజ్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈయన పెళ్లి వార్తలు ఇప్పుడు కాదు 2022లోనే స్టార్ట్ అయ్యాయి.
వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ( Lavanya tripati ) ని లవ్ చేస్తున్నాడు అని వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా బాగా వార్తలు వస్తున్నాయి.

అప్పటి నుండి వస్తున్న వార్తలకు ఇప్పుడు ఫుల్స్టాప్ పడుతున్నట్టు తెలుస్తుంది.వరుణ్ తేజ్, లావణ్య ఈ ఎలా జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అంటూ నిన్నటి నుండి నెట్టింట పలు వార్తలు వస్తున్నాయి.మరి అందుతున్న సమాచారం ప్రకారం ఆ రోజు మెగా హీరోల సినిమా షూటింగులు ఏవీ జరగవు అని ఇప్పటి నుండే హీరోలంతా షూటింగ్ లు లేకుండా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు అని టాక్.
మొత్తానికి మెగా ఫ్యామిలీ ఫంక్షన్ కోసమా అంతా సిద్ధం అవుతున్నారు.
