చిరుతో వరుణ్ తేజ్ 101 దోస ఛాలెంజ్.. నా దోస రౌండ్ గా రాలేదంటూ మెగాస్టార్ కుళ్లు?

Varun Tej 101 Dosa Challenge With Chiru

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి, ఆయన స్టైల్ గురించి అందరికీ తెలిసిందే.ఒక నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.

 Varun Tej 101 Dosa Challenge With Chiru-TeluguStop.com

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.తానే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి కూడా ఒక హోదాను అందించాడు.

చిరంజీవి సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా 1978 లో పునాది రాళ్లు సినిమాతో పరిచయం అయ్యాడు.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.

 Varun Tej 101 Dosa Challenge With Chiru-చిరుతో వరుణ్ తేజ్ 101 దోస ఛాలెంజ్.. నా దోస రౌండ్ గా రాలేదంటూ మెగాస్టార్ కుళ్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతి తక్కువ సమయంలో మెగాస్టార్ గా నిలిచాడు.దాదాపు 150కి పైగా సినిమాలలో నటించాడు.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించాడు చిరంజీవి.తన నటనకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

ఇక ఒక నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడుగా కూడా బాధ్యతలు చేపట్టాడు.కానీ నటుడుగానే మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

రాజకీయ పరంగా చిరంజీవి ఎందుకో ముందుకు కొనసాగలేకపోయాడు.

అంతే కాకుండా టీవీ వ్యాఖ్యాత కూడా చేశాడు చిరంజీవి.రియాలిటీ షో మీలో ఎవరు కోటీశ్వరులులో హోస్టింగ్ చేసి బాగా ఆకట్టుకున్నాడు.ఇక ఈయన వ్యక్తిగతంగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఎంతోమందికి ఆర్థికంగా సహాయం చేశాడు.సొంతంగా బ్లడ్ బ్యాంకు ను నిర్మించాడు.

కరోనా సమయంలో తన వంతు సహాయం తో ముందుకు వచ్చాడు.

ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లకు కూడా తన వంతు సహాయం చేస్తూ ఉంటాడు.

ఇక చిరంజీవి సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటాడు.

ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను, ఫన్నీ వీడియో లను కూడా బాగా పంచుకుంటాడు.

ఇదంతా పక్కన పెడితే చిరంజీవి వంటలలో కూడా స్పెషల్ అని అందరికీ తెలుసు.అందులో దోస కి మాత్రం ఆయన చాలా స్పెషల్.

పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన తన దోష గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా చిరు దోష చేస్తుండగా వరుణ్ తేజ్ కూడా చిరంజీవి పక్కన ఉండి దోస ఛాలెంజ్ చేశాడు.

ఇక దీనికి సంబంధించిన వీడియో వరుణ్ తేజ్ తన ఇన్ స్టా లో షేర్ చేసుకున్నాడు.చిరుతో 101 దోస ఛాలెంజ్ అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఇక ఆ వీడియోలో చిరంజీవి, వరుణ్ తేజ్ ఇద్దరు చక్కగా దోసలు చేస్తున్నారు.అందులో వరుణ్ తేజ్ దోస రౌండ్ గా రాగా.చిరు దోస బాగా రాలేకపోయింది.

దీంతో చిరంజీవి వెంటనే తన దోస బాగా రాలేదని కుళ్ళుతో వరుణ్ దోసను పాడు చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.అందులో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.

#Dosa Challenges #Varun Tej #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube