ఆ కోరిక నెరవేరిందంటున్న వరుణ్ సందేశ్ భార్య..?  

బాలనటిగా సినిమా ఇండస్ట్రీలో కెరీర్ ను ప్రారంభించి ప్రేమించు రోజుల్లో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది వితికా షేరు.ఆ సినిమా తరువాత ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు, ప్రేమ ఇష్క్ కాదల్, పడ్డానండి ప్రేమలో మరీ, మరికొన్ని సినిమాల్లో వితికా షేరు నటించారు.

TeluguStop.com - Varun Sandesh Wife Vithika About Hosting Samajavaragamana Show

అయితే ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో వితికకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.ఒక సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ వితికా షేరు ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడంతో వరుణ్ సందేశ్, వితికా షేరు జంటకు రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు వచ్చింది.బిగ్ బాస్ షో ద్వారా కొంత నెగిటివ్ ఇమేజ్ తో బయటకు వచ్చిన వితిక ప్రస్తుతం సామజవరగన అనే షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

TeluguStop.com - ఆ కోరిక నెరవేరిందంటున్న వరుణ్ సందేశ్ భార్య..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిన్నప్పటి నుంచి యాంకర్ గా చేయాలని కోరిక ఉన్న వితిక సామజవరగమన షో ద్వారా ఆ కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు.ఆ కోరిక నెరవేరడం గురించి వితిక స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు బాల్యం నుంచి ఒక షోకు యాంకర్ గా చేయాలని ఉండేదని.ఆ కల ఎట్టకేలకు నెరవేరిందని.ఈ షోలో నా ప్రయాణం ఎలా జరిగిందో చూపిస్తానంటూ వితిక వీడియోను షేర్ చేశారు.ప్రతి ఎపిసోడ్ కు ఒక కొత్త లుక్ లో వెళ్లాలని అనుకునేదానినని.

ఆ కోరిక సైతం ఈ షో ద్వారా తీరిందని తెలిపారు.తనకు హెవీ మేకప్ నచ్చదని ఎప్పుడూ లైట్ గా మేకప్ వేసుకుంటానని వితిక తెలిపారు.

సామజవరగమన షోకు సంబంధించిన ప్రయాణం తన కెరీర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.వితిక వీడియోలో తన అమ్మ, చెల్లి, అన్నయ్యలను పరిచయం చేశారు.వితికతో పాటు నోయల్ ఈ షోకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

#Vithika Sheru #Bigg Boss 3

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varun Sandesh Wife Vithika About Hosting Samajavaragamana Show Related Telugu News,Photos/Pics,Images..