వరుణ్ సందేశ్ ఆ పని చెయ్యడం వల్లే ఈరోజు ఇలా?

సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు.ఇక అలానే ఉదయ్ కిరణ్, వడ్డే నవీన్, తొట్టెంపూడి వేణు ఇలా ఎంతోమంది వచ్చి సినిమాలలో కనిపించడం లేదు.

 Hero Varun Sandesh Reveals About His Career Flops,varun Sandesh, Super Hit Films-TeluguStop.com

ఇక అలానే వరుణ్ సందేశ్ కూడా కనిపించలేదు.మొన్న బిగ్ బాస్ 3 సీజన్ కి వచ్చి మంచి గేమ్ ఆడినా వరుణ్ సందేశ్ సినిమాలలో మాత్రం కనిపించలేదు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో హ్యాపీ డేస్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో కొత్త బంగారు లోకం సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఏమైంది ఈవేళ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మరింత దగ్గరయ్యారు.అయితే అలాగే హిట్స్ కొట్టి ఉంటే ఇప్పటికి ప్రభాస్ పక్కన కనిపించేవాడు.

కానీ కొన్ని పనుల వల్ల అయన సినిమాలలో హిట్స్ కొట్టకుండా దూరం అయ్యారు.

అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ కొన్ని సంచలన విషయాలు చెప్పాడు.

కెరీర్ లో సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించలేదని, కొన్ని మల్టీ స్టారర్ సినిమాల్లో చేసిన ఉపయోగం లేకుండా పోయిందని అయన చెప్పాడు.అంతేకాదు వరుణ్ సందేశ్ వదులుకున్న సినిమాల పేర్లు కూడా చెప్పాడు.

నాగచైతన్య నటించిన 100%లవ్, నితిన్ నటించిన గుండెజారి గల్లంతయ్యిందే, నాని నటించిన బీమిలి కబడ్డీ జట్టు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను వదులుకున్నట్టు అయన చెప్పాడు.ఏది ఏమైనా ఆ సినిమాల్లో నటించి ఉంటే ఇప్పటికి మంచి ఫామ్ లో ఉన్న హీరోగా నిలిచేవాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube