ఆకట్టుకున్న ఇందువదన టీజర్.. వరుణ్ సందేశ్ ఈసారి కొట్టేలా ఉన్నాడు..!

హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ సందేష్ మంచి ఫాం లో ఉన్న టైం లో రొటీన్ సినిమాలతో ఫ్లాపులు అందుకున్నాడు.కెరియర్ దాదాపు అయిపోయింది అనుకుంటున్న టైం లో ఇప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు.

 Varun Sandesh Induvadana Teaser Released-TeluguStop.com

వరుణ్ సందేష్ హీరోగా ఎం.ఎస్.ఆర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇందువదన.పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన ఈ మూవీ టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

ఈ టీజర్ చూస్తే సినిమా లవ్ కమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతుందని తెలుస్తుంది.సినిమాలో వరుణ్ సందేష్ కు జోడీగా ఫర్నాన్ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

 Varun Sandesh Induvadana Teaser Released-ఆకట్టుకున్న ఇందువదన టీజర్.. వరుణ్ సందేశ్ ఈసారి కొట్టేలా ఉన్నాడు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్రీ బాలాజి పిక్చర్స్ బ్యానర్ లో ఆదుర్తి మాధవి ఈ మూవీ నిర్మిస్తున్నారు.వరుణ్ సందేష్ ఇందువదన టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది.సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని అనిపిస్తుంది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇందువదనగా ప్రయత్నం చేస్తున్న వరుణ్ సందేష్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

టీజర్ చాలా ఫ్రెష్ గా ఉండగా సినిమా అంచనాలను అందుకుంటే వరుణ్ సందేష్ మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు.

#Induvadana #Varun Sandesh #Teaser #Varun Sandesh #Farnan Shetty

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు