ఇందువదన ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీ పెంచిన వరుణ్ సందేశ్

హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో వరుణ్ సందేశ్.టాలెంటెడ్ యాక్టర్ గా టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్న ఈ యువ హీరో కెరియర్ ఊహించని విధంగా డిజాస్టర్ అయిపొయింది.

 Varun Sandesh Induvadana First Look-TeluguStop.com

రెండు సక్సెస్ లు వచ్చిన తర్వాత సరైన కెరియర్ ప్లానింగ్ లేకపోవడం వచ్చిన ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్ళాడు.అలాగే కెరియర్ లో ఎక్కువగా రొటీన్ ప్రేమకథా చిత్రాలు మాత్రమే చేయడంతో వరుణ్ సందేశ్ ఇమేజ్ పడిపోయింది.

ఏ సినిమా చేసిన కూడా కనీసం వారం రోజులు కూడా థియేటర్ లో సందడి చేసిన దాఖలాలు లేవు.కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యాయో కూడా ఎవరికీ తెలియదు.

 Varun Sandesh Induvadana First Look-ఇందువదన ఫస్ట్ లుక్ తో క్యూరియాసిటీ పెంచిన వరుణ్ సందేశ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో హీరోగా కెరియర్ దెబ్బ తినడంతో కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్, క్యామియో రోల్స్ కూడా చేశాడు.అయితే బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న తర్వాత మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చాడు.

అయితే బిగ్ బాస్ తర్వాతబయటకొచ్చి రెండు సినిమాలు స్టార్ట్ చేసిన అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా వరుణ్ సందేశ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన కొత్త సినిమాకి సంబందించిన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

తన సినిమా టైటిల్ ఇందువదన అని రివీల్ చేయడంతో ఫస్ట్ లుక్ ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందని చెప్పాడు.ఇక అలా చెప్పినట్లుగానే తాజాగా వరుణ్ సందేశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు కాస్తా ఇంటరెస్టింగ్ గా కూడా అనిపించింది.

హీరోయిన్ తో రొమాంటిక్ స్టిల్ ఇచ్చిన వరుణ్ సందేశ్ శోభన్ బాబు స్టైల్ రింగ్ తో కళాకారుడు గెటప్ లో ఉండగా అతన్ను హగ్ చేసుకొని ఎంకి గెటప్ లో పైన ఎలాంటి జాకెట్ లేకుండా హీరోయిన్ తడిసిన అందాలతో హీరో వైపు తనివితీరా చూస్తున్నట్లు ఉంది.ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై కాస్తా క్యూరియాసిటీ పెంచాడని చెప్పాలి.

మొత్తానికి మన స్టార్ హీరోల తరహాలోనే వరుణ్ సందేశ్ కూడా పీరియాడిక్ జోనర్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీనే ఈ సినిమా కోసం ఎంచుకున్నట్లు తెలుస్తుంది.

#Periodic Goner #InduvadanaFirst #Varun Sandesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు