వరుణ్‌ కౌంటర్‌తో కన్నీరు పెట్టుకున్న శ్రీముఖి  

Varun Sandesh Counter To Srimukhi-rahul Guess Task,sri Mukhi,varun Sandesh,vithika And Punarnavi

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో అత్యంత సౌమ్యుడిగా వరుణ్‌ సందేశ్‌ పేరు దక్కించుకున్నాడు.మొదటి వారంలో మహేష్‌ విట్టాతో ప్రవర్తించిన తీరు తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా వరుణ్‌ సందేశ్‌ ఎవరిపై కోపం తెచ్చుకున్నది లేదు.అప్పుడప్పుడు తన భార్య వితికపై ఫైర్‌ అవుతూ ఉంటాడు.ఆ వెంటనే వెళ్లి సారీ చెప్పడం కూడా జరుగుతుంది.కాని ఈసారి మాత్రం శ్రీముఖిపై కాస్త ఎక్కువగానే సీరియస్‌ అయ్యాడు.ఏకంగా శ్రీముఖి కన్నీరు పెట్టుకునే స్థాయిలో ఆయన అరిచాడు.

Varun Sandesh Counter To Srimukhi-rahul Guess Task,sri Mukhi,varun Sandesh,vithika And Punarnavi-Varun Sandesh Counter To Srimukhi-Rahul Guess Task Sri Mukhi Varun Vithika And Punarnavi

Varun Sandesh Counter To Srimukhi-rahul Guess Task,sri Mukhi,varun Sandesh,vithika And Punarnavi-Varun Sandesh Counter To Srimukhi-Rahul Guess Task Sri Mukhi Varun Vithika And Punarnavi

నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ గెస్‌ చేసే టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చాడు.కన్ఫెషన్‌ రూంకు వెళ్లి అక్కడ బిగ్‌బాస్‌ ఆదేశాల అనుసారం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది.

అదే బయట వచ్చి చెప్తే నిజమేనా కాదా అని ఇంటి సభ్యులు నిరూపించాలి.రాహుల్‌ కన్ఫెషన్‌ రూంకు వెళ్లి 50 సిట్‌ అప్స్‌ చేయడం జరిగింది.ఆ తర్వాత 10 పీజ్‌లు తాగాడు.కాని బయటకు వెళ్లి అమ్మ మాట్లాడింది, పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, నువ్వు సిగరెట్లు ఎందుకు ఎక్కువగా తాగుతున్నావు అంటూ తిట్టిందని బయటకు వచ్చాక చెప్పాడు.

రాహుల్‌ చెప్పింది నిజమే అని కొందరు చెప్పగా, కొందరు మాత్రం నమ్మలేదు.రాహుల్‌ వద్దకు వెళ్లి శ్రీముఖి హార్ట్‌ బీట్‌ విని మరీ రాహుల్‌ అతడి మమ్మీతో మాట్లాడాడు అంటూ గట్టిగా చెప్పింది.ఇతరులు కూడా తన మాట వినాలని, వినకపోతే బొక్క పడిపోతుందని అంది.దాంతో అప్పటి వరకు చేతులు ఎత్తని వితిక మరియు పునర్నవిలు కూడా చేతులు ఎత్తారు.

దాంతో ఆ గెస్‌ రాంగ్‌ అని బిగ్‌బాస్‌ ప్రకటించాడు.దాంతో వరుణ్‌ స్పందిస్తూ నీవు ఎందుకు అంతగా ఇతరులను ఇన్ఫ్యూలెన్స్‌ చేసి చేతులు ఎత్తించావు అంటూ ప్రశ్నించాడు.అందుకు శ్రీముఖి కాస్త గట్టి స్వరంతో వరుణ్‌పై పడింది.ఇద్దరు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు.ఆ తర్వాత శ్రీముఖి కన్నీరు పెట్టుకుంది.టాస్క్‌ అయిన తర్వాత వరుణ్‌ వెళ్లి మళ్లీ శ్రీముఖికి సారీ చెప్పడం, ఇద్దరు కూల్‌ అవ్వడం జరిగింది.