కూలీ నెంబర్ 1 రీమేక్ ని నాశనం చేశారంటా... దారుణమైన రేటింగ్స్

తెలుగులో వెంకటేష్, టబు కాంబినేషన్ లో వచ్చిన కూలి నెంబర్ 1 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ సినిమాతోనే టబు టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

 Varun Dhawan's Coolie No 1 Stands At 1.3 Rating On Imdb, Tollywood, Bollywood, D-TeluguStop.com

ఇక ఈ సినిమాని హిందీలో గోవింద్ హీరోగా తెరకెక్కించారు.వీటికి ఒరిజినల్ తమిళ్ మూవీ.

ఈ మూడు బాషలలో కూలి నెంబర్ 1 టైటిల్ తోనే ఈ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది.ఆయా హీరోల కెరియర్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.

ఈ నేపధ్యంలో అదే సినిమాని అప్పుడు తెరకెక్కించిన దర్శకుడు డేవిడ్ ధావన్ మళ్ళీ కొడుకుని వరుణ్ ధావన్ ని హీరోగా పెట్టి రీమేక్ చేశాడు.ఈ నేపధ్యంలో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

రిలీజ్ కి ముంది సినిమా ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.సూపర్ హిట్ గ్యారెంటీ అనిఆ అందరూ భావించారు.

ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.రిలీజ్ తర్వాత సినిమా పూర్తిగా తేలిపోయింది.

డివైడ్ టాక్ సొంతం చేసుకుంది.సినిమా ప్రెజెంట్ నేటివిటీకి ఏ మాత్రం దగ్గరగా లేదని క్రిటిక్స్ సైతం తేల్చేశారు.

ఈ నేపధ్యంలో రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి.ప్రముఖ పబ్లిషర్స్ సైతం ఈ సినిమా డిజాస్టర్ అని రాశాయి.

ఒరిజినల్ మూవీ ఫీల్ మొత్తం చెడగొట్టారని, అనవసరమైన హాస్యం ఎక్కువ అయిపోయిందని రివ్యూలో పేర్కొన్నారు.

ఇక ఈ ఏడాది సడక్ 2కి అత్యంత చెత్త రేటింగ్స్ వచ్చాయి.

ఆ సినిమాకి ఐఎండిబి కేవలం ఒకటి రేటింగ్ ఇచ్చింది.ఇప్పుడు సడక్ సమీపానికి ఈ సినిమా కూడా వచ్చి చేరింది.ఈ చిత్రం 1.3 రేటింగ్‌ను కలిగి ఉంది.ఇది రేస్-3కి 1.9 రేటింగ్, హిమ్మత్‌వాలా 1.7 రేటింగ్స్ ఉండగా వాటికంటే ఘోరమైన రేటింగ్స్ ను ఈ సినిమా పొందింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కూలీ నెం 1 అతిపెద్ద ఓపెనింగ్‌ను నమోదు చేసిందని ఆమెజాన్ పేర్కొంది.

అయితే అదే స్థాయిలో ఈ ఏడాది సడక్ తర్వాత అతిపెద్ద డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది.ఒక ఈ సినిమాలో ట్రైన్ పైన హీరో పరుగెత్తి పిల్లాడిని కాపాడే సన్నివేశం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

బాలయ్య బాబు సినిమాని మించిపోయే విధంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్ గా నటించింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube