జనవరి 24న ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడబోతున్న బాలీవుడ్ హీరో  

Varun Dhawan Marriage Date Confirmed, Tollywood, Bollywood, Ranabir Kapoor, Aliya bhatt, Natash Dalal,libhagh,college days,restorant,lovers,rana ,nithin,40-50 members - Telugu Aliya Bhatt, Bollywood, Natash Dalal, Ranabir Kapoor, Tollywood, Varun Dhawan

గత ఏడాది చాలా మంది సినీ సెలబ్రెటీలు వివాహాలు చేసుకొని కొత్త జీవితం స్టార్ట్ చేశారు.తెలుగులో రానా, నితిన్, నిఖిల్, నిహారిక పెళ్లి చేసుకున్నారు.

TeluguStop.com - Varun Dhawan Marriage Date Confirmed

అలాగే బాలీవుడ్ లో కూడా చాలా మంది ప్రేమజంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఈ ఏడాది ఆరంభంలో మరో బాలీవుడ్ ప్రేమజంట కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ లో హీరోగా తనకంటూ ప్రత్యేకం గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు వరుణ్ ధావన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.తన ప్రియురాలు, చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ని ఈ నెలలో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

TeluguStop.com - జనవరి 24న ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడబోతున్న బాలీవుడ్ హీరో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ జంట పెళ్లిపై గత కొద్ది రోజులుగా కథలు వినిపిస్తున్నాయి.జనవరి 24న వివాహం జరుగుతుందని ఎంపిక చేసిన అతిథుల బృందానికి ఆహ్వానాలు పంపినట్లు తెలిసింది.

కేవలం 40 నుంచి 50 వరకు అతిధులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకి హాజరవుతారని భోగట్టా.వివాహానికి లీబాగ్‌లోని బీచ్‌కు ఎదురుగా ఉన్న మొత్తం రిసార్ట్‌ను బుక్ చేసారు.

చాలా సింపుల్ గా వేడుక జరిపించడానికి ప్రణాళికలు వేస్తున్నారు.వివాహ కార్యక్రమాలు 3 రోజులు జనవరి 22, 23 మరియు 24 తేదీల్లో వుంటాయి.

అతిథుల జాబితాలో కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సన్నిహితులు, సహచరులు మాత్రమే వుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.వరుణ్ ధావన్, నటాషా దలాల్ చాలా కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు.

కాలేజీ డేస్ నుంచి ఇద్దరు ప్రేమికులు అనే విషయాన్ని ఆ మధ్య వరుణ్ ధావన్ రివీల్ చేశాడు.కరోనా లాక్ డౌన్ లేకపోతే గత ఏడాది వీరి వివాహం జరిగేది.

ఇదిలా ఉంటే వరుణ్ ధావన్ పెళ్లి కొడుకు కాబోతూ ఉండటంతో ఇప్పుడు రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లిపై బాలీవుడ్ లో మరో సారి చర్చ నడుస్తుంది.

#Aliya Bhatt #Ranabir Kapoor #Natash Dalal #Varun Dhawan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు