సెల్ఫీ ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరిస్తున్న లేడీ ఫ్యాన్‌  

Varun Dhawan Got Warning From Lady Fan About Selfie-telugu Viral News,varun Dhawan,varun Dhawan Viral In Social Media,viral About Varun Dhawan

స్టార్‌ హీరోల గురించి, సెలబ్రెటీల గురించి మనం చాలా అనుకుంటాం. కాని వారికి ఉండే కష్టాలు వారికి ఉంటాయి. వారు పడే బాధలు వారు పడతారు...

సెల్ఫీ ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరిస్తున్న లేడీ ఫ్యాన్‌-Varun Dhawan Got Warning From Lady Fan About Selfie

సెలబ్రెటీలు ముఖ్యంగా బయట ప్రపంచంలో తిరగాలంటే చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా సెలబ్రెటీలు అభిమానుల కారణంగా తెగ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బయటకు వెళ్తే చాలు ఈమద్య కాలంలో సెల్ఫీలు అంటూ తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

తాజాగా బాలీవుడ్‌ హీరో వరుణ్‌ దావన్‌ను ఒక ఫ్యాన్‌ ఏకంగా చంపేస్తానంటూ హెచ్చరించింది.

వరుణ్‌ దావన్‌కు వీరాభిమాని అయిన ఒక అభిమాని ముంబయిలోని ఆయన ఇంటికి వెళ్లింది. వరుణ్‌ను కలవాల్సిందే అంటూ పట్టుబట్టింది. వరుణ్‌ దావన్‌ లేడంటూ సెక్యూరిటీ వారు ఆమెను పంపించేందుకు ప్రయత్నించారు.

కాని ఆమె మాత్రం అక్కడ నుండి వెళ్లలేదు. ఒక సెల్ఫీ తీసుకోవాల్సిందే, ఆయనతో సెల్ఫీ తీసుకోనివ్వక పోతే ఆయన ప్రియురాలిని చంపేస్తాను అంటూ బెదిరించింది. ఇంటి ముందు బైఠాయించిన ఆమెపై సెక్యూరిటీ సిబ్బంది ఎంత ఒత్తిడి తీసుకు వచ్చినా ఆమె అక్కడ నుండి వెళ్లలేదు...

దాంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి ఆమెను అక్కడ నుండి తీసుకు వెళ్లారు. ఆమె ఆ తర్వాత కూడా వరుణ్‌ దావన్‌ తనతో సెల్ఫీ తీసుకోకుంటే ఆయన ప్రియురాలిని చంపేస్తాను అంటూ బెదిరించడం చర్చనీయాంశం అయ్యింది. వరుణ్‌ తమ ముందే ఇంట్లోకి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటి ముందు ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌ను కనీసం పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లడం ఏంటీ అంటూ ప్రశ్నించింది.