చిన్నపిల్లలంటే ప్రతి ఒక్కరు గారాభం చేస్తుంటారు.వారు నిష్కల్మశులు కాబట్టి వారితో సరదాగా సమయం గడుపుతూ ఉంటారు.
ఇక చిన్నపిల్లల పుట్టిన రోజు అయితే ఇక సందడి మామూలుగా ఉండదు.ఇక వారు ఆ సమయంలో చేసే పనులు చాలా క్యూట్ గా ఉంటాయి.
కొన్ని సార్లు మనం వాళ్ళను బాధపడుతాం.కూడా.
ఇక అసలు విషయంలోకి వెళ్తే వరుణ్ ధావన్ ప్రస్తుతం భేడియా సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.ఈ సినిమా చిత్రీకరణ అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక షూటింగ్ అంటే సందడి మామూలుగా ఉండద.అందరూ స్టార్ లు ఒక్క దగ్గర చేరి చాలా సరదాగా ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంటారు.
అయితే ఈ షూటింగ్ లో ఉన్న క్రూలో ఒకరి పాప పుట్టినరోజు కావడంతో ఆ పుట్టిన రోజు వేడుకల్లో హీరో వరుణ్ ధావన్ పాల్గొన్నారు.ఆ సమయంలో వరుణ్ ధావన్ చేసిన ఈ పని నటి కృతిసనన్ కు ఆగ్రహం తెప్పించింది.
అయితే అక్కడ జరిగింది ఏంటంటే వరుణ్ ధావన్ కేక్ కట్ చేసి ఆ చిన్నారి తండ్రికి కేక్ తినిపించడం జరిగింది.అయితే పాపం చిన్నారి కేక్ ఇస్తాడనే ఆశతో చూసింది.
కానీ వరుణ్ చిన్నారి తండ్రికి ఇవ్వడంతో చిన్నారి బాధపడింది.అయితే చిన్నపిల్లను అలా చేసి బాధపపెడతావా అంటూ కృతిసనన్ వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.