మరోసారి జతకట్టనున్న వరుణ్,పూజ  

Varun And Pooja Are Getting Together Again -

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వెండి తెరకు పరిచయం చేసిన చిత్రం ముకుంద.ఈ చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే జత కట్టిన సంగతి తెలిసిందే.

Varun And Pooja Are Getting Together Again

వరుణ్ తోలి చిత్రమైనప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది.అయితే ఇప్పుడు తాజా గా ఇదే జంట మరోసారి వెండి తెరపై అలరించనుంది.

హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో వీరిద్దరూ జంటగా ‘వాల్మీకీ’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

అయితే తమిళం విజయవంతమైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇదే రీమేక్ అని సమాచారం.ఈ చిత్రంలో వరుణ్ తో పాటు తమిళ కధానాయకుడు అధర్వ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

అలానే తొలుత ఓ కొత్త కథానాయికని ఎంపిక చేసుకోవాలని భావించిన చిత్ర బృందం చివరికి పూజ నే కథానాయకి గా ఎంచుకుంది.

ఇప్పటికే మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా తో బీజీ గా ఉన్న ఈ భామ, మరోపక్క అల్లు అర్జున్,ప్రభాస్ ల వంటి అగ్ర కథానాయకుల తో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మొత్తానికి మంచి జోరు మీదున్న పూజ త్వరలోనే ఈ ‘వాల్మీకి’ కోసం రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.అయితే ఈ చిత్రంలో వరుణ్ పాత్ర మాత్రం భిన్నంగా వ్యతిరేక ఛాయలతో సందడి చేయనున్నట్టు సమాచారం.14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varun And Pooja Are Getting Together Again- Related....