తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా( Bhanushree Mehra ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.భాను శ్రీ మెహ్రా అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ వరుడు సినిమాలో హీరోయిన్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు.
ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయినప్పటికీ ఆశించిన రేంజ్ లో ఈమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు.
వరుడు సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.
భానుశ్రీ ఈ సినిమాకి హీరోయిన్( Heroine ) కి చాలా హైప్ ఇచ్చినా సినిమా ఫ్లాప్ అవ్వడంతో భానుశ్రీ ని ఎవరూ పట్టించుకోలేదు.ఆ తర్వాత కొన్ని తమిళ్, తెలుగు, పంజాబీ సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా గుర్తింపుని తెచ్చిపెట్టలేకపోయాయి.ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ ముద్దుగుమ్మ వరుసగా ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంది.
మొన్నటికి మొన్న దగ్గర నిలబడి అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో నిలిచిన విషయం తెలిసిందే.ఇటీవల కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్( Allu Arjun ) నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశాడంటూ ట్వీట్ చేసి ఒక్కసారిగా వైరల్ అయింది.
దీంతో బన్నీ అభిమానులు భానుపై సీరియస్ అయ్యారు.ఆ తర్వాత మళ్ళీ అన్ బ్లాక్ చేశాడని ట్వీట్ చేసింది.అవకాశాల కోసం ఇన్నాళ్లు ఎదురు చూస్తూనే ఉంది భానుశ్రీ.తాజాగా ఏమనుకుందో ఏమో ఒక డెసిషన్ తీసుకున్నట్టు ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసింది.తన ఫోటోని షేర్ చేస్తూ ఇప్పుడు నిజం మాట్లాడే సమయం.యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ( YouTube, Instagram )కోసం కొత్త కంటెంట్ సృష్టించడానికి ప్రయాణించబోతున్నాను.
ట్రావెలింగ్ చేసి కొత్త ప్రదేశాలని అన్వేషించబోతున్నాను.నటన అనేది నా ఫ్యాషన్.
సినిమా సెట్స్ లో ఉండటం నేను మిస్ అవుతున్నాను.కొన్ని మంచి సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను అని తన పోస్ట్ లో రాసుకొచ్చింది.
దీంతో భానుశ్రీకి సినిమా అవకాశాలు లేకపోవడంతో ట్రావెలింగ్ చేయబోతున్నట్టు తెలిపింది.ఇలా ట్విట్టర్ లోనే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ అడిగేసింది.
దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.అయితే చాలామంది ఆ పోస్ట్ ని చూసి ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
మీరేం టెన్షన్ పడకండి మేడం మీకు తప్పకుండా సినిమా అవకాశాలు వస్తాయి నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ కొందరు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.