వరుడు కావలెను ట్రైలర్ రిలీజ్.. విచిత్రమైన కాన్సెప్ట్?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా రీతు వర్మ హీరోయిన్ గా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతున్నటువంటి చిత్రం “వరుడు కావలెను“.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

 Varudu Kaavalenu Theatrical Trailer Launched Rana Daggubati, Varudu Kavalenu, Na-TeluguStop.com

ఇదిలా ఉండగా ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది.ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయాలని చిత్రబృందం భావించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను హీరో రానా విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో హీరో హీరోయిన్లు భూమి, ఆకాశ్ పాత్రలలో సందడి చేయనున్నారు.అసలు పెళ్లిచూపులు అనే కాన్సెప్ట్ నచ్చని భూమిని ఆకాష్ ఏవిధంగా ప్రేమలో దింపాడు, ఇలా ప్రేమలో ఉన్న వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకొని ఎలా విడిపోయారు అనే కాన్సెప్ట్ తో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

ఈ ట్రైలర్ లో భాగంగా పెళ్లిచూపులు అనే కాన్సెప్ట్ మా అమ్మాయికి నచ్చదు అనే డైలాగ్ తో ప్రారంభమయ్యే ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సినిమాపై అంచనాలను పెంచుతుంది.

మరి ఇందులో భూమి ఆకాష్ ఎలా కలిసారు?వారి విడిపోవడానికి కారణం ఏమిటి అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube