వెండితెరను ఏలుతానంటోన్న బుల్లితెర బ్యూటీ

టాలీవుడ్‌లో బుల్లితెర నుండి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది ఉబలాటపడుతుంటారు.కాగా ఇప్పటికే ఈ కోవలో అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వాళ్లు వెండితెరపై తమ అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు.

 Varshini To Star In Agent Vinod, Varshini, Anchor Varshini, Agent Vinod, Tollywo-TeluguStop.com

ఇక తాజాగా మరో బుల్లితెర బ్యూటీ వర్షిని వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది.ఈ బ్యూటీ గతంలో చందమామ కథలు అనే సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసినా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు.

దీంతో బుల్లితెరపై అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లిన వర్షిని, ప్రస్తుతం ఉన్న యాంకర్‌లలో తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది.ఇక ఈ బ్యూటీ అందంతో పాటు అభినయంతోనూ మెప్పించగలదనే నమ్మకంతో ‘ఏజెంట్ వినోద్’ చిత్ర యూనిట్ ఆమెను హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారు.

బాబు బాగా బిజీ’ చిత్రాన్ని తెరకెక్కించిన నవీన్ మేడారం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఏజెంట్ వినోద్‌పై అప్పుడే అంచనాలు ఏర్పడుతున్నాయి.ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది.

కాగా ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.ఇందులో వర్షిని పర్ఫార్మెన్స్‌తో పాటు అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో ఒక నోటెడ్ యాక్టర్ లీడ్ రోల్‌లో నటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపిందే.ఆ నటుడి పేరును మాత్రం వారు ఇంకా రివీల్ చేయలేదు.

మొత్తానికి బుల్లితెర నుండి మరో హాట్ బ్యూటీ వెండితెరపై తన అదృష్టాన్ని చూసుకునేందుకు సిద్ధపడటంతో, ఆమె మంచి విజయం అందుకోవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.అనసూయ, రష్మీల లాగా ఆమె కూడా వరుసగా సినిమాల్లో నటిస్తే చూడాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube