అతడే పక్కా విన్నర్‌ అంటున్న లేడీ యాంకర్‌

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విన్నర్‌ గా ఎవరు నిలవబోతున్నారు అంటే ప్రతి ఒక్కరు ఠక్కున ఒకే ఒక్క పేరు చెబుతున్నారు.ఆ పేరే అభిజిత్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Varshini Says Bigg Boss 4 Winner Is Abhijith, Pelli Chupulu Web Series, Anchor V-TeluguStop.com

అభిజిత్‌ తప్ప మరెవ్వరికి ఆ అవకాశం కూడా లేదు అంటూ బల్ల గుద్ది మరీ చెప్పడం జరుగుతుంది.పరిస్థితులు చూస్తుంటే అభిజిత్‌ మాత్రమే విన్నర్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది.

ఎక్కువ సార్లు నామినేట్‌ అవ్వడంతో పాటు ఎక్కువ సార్లు సేవ్‌ అయిన కంటెస్టెంట్‌గా అభిజిత్‌ నిలిచాడు.మొదటి సెంటిమెంట్‌ ప్రకారం ఎక్కువ సార్లు నామినేట్‌ అయిన వ్యక్తి సేవ్‌ అవుతూ వచ్చిన వ్యక్తి విజేతగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే ఈసారి అభిజిత్‌ అవుతాడు అంటూ అంతా నమ్మకంగా చెబుతుంటే అదే విషయాన్ని తాజాగా యాంకర్‌ వర్షిణి కూడా చెప్పుకొచ్చింది.

Telugu Abhijith, Bb Abhijith, Bb, Bigg Boss, Varshini-Movie

బుల్లి తెరపై తనదైన ముద్రను వేసిన వర్షిణి ఇప్పటికే అభిజిత్‌ తో పెళ్లి చూపులు అనే వెబ్‌ సిరీస్‌ను మూడు సీజన్‌లుగా నటించింది.ఇద్దరి మద్య మంచి స్నేహం ఉంది.ఇద్దరికి ఉన్న ర్యాపో వల్ల అభిజిత్‌ బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చిన సమయంలో వర్షిణికి కాల్‌ చేసి ఆఫర్ వచ్చింది వెళ్తే ఎలా ఉంటుంది అంటూ అడిగాడట.

ఆ సమయంలో తప్పకుండా వెళ్లు నీకు బాగుంటుందని చెప్పాను అంది.ఇక ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్‌ లో ఖచ్చితంగా నాకు నా స్నేహితుడు అభిజిత్‌ అంటే ఇష్టం.

అతడే విజేత అని కూడా నాకు అనిపిస్తుంది.ఆయనకు పోటీ ఇచ్చే వారు కనిపించడం లేదు.

మైండ్‌ గేమ్‌ ఆడే అభిజిత్‌ను ఇప్పటికే ప్రేక్షకులు అంతా కూడా ఓన్‌ చేసుకున్నారు.అందుకే ఆయన విజేత అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అంది.

ఇక వర్షిణి సోదరి కూడా నాకు అభిజిత్‌ అంటే చాలా ఇష్టం.అతడితో ఒకసారి కలవాలని ఉంది.

నేను కూడా అభిజిత్‌ విజేత అవ్వాలని కోరుకుంటున్నాను, అతడే అవుతాడని భావిస్తున్నాను అంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube