ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల బాధ పడుతున్నాం.. వర్ష ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర సీరియళ్ల ద్వారా, జబర్దస్త్ ద్వారా వర్ష ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.వర్షకు సోషల్ మీడియాలో కూడా భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Varsha Emotional Post About Her Brother Road Accident Goes Viral Details, Jabardasth Varsha, Varsha Brother, Road Accident, Driving, Varsha Emotional Post, Emmanuel, Jabardasth-TeluguStop.com

జబర్దస్త్ షోలో వర్ష ఇమ్మాన్యుయేల్ కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వర్ష ఆ ఫోటోల ద్వారా అభిమానులకు మరింత చేరువ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు.తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆ బాధను వర్ష సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

 Varsha Emotional Post About Her Brother Road Accident Goes Viral Details, Jabardasth Varsha, Varsha Brother, Road Accident, Driving, Varsha Emotional Post, Emmanuel, Jabardasth-ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల బాధ పడుతున్నాం.. వర్ష ఎమోషనల్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆస్పత్రిలో తన సోదరుడు చికిత్స చేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసిన వర్ష ప్రస్తుతం తన సోదరుడి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చారు.డ్రైవింగ్ చేసే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.

జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే ఏ కుటుంబం కూడా బాధ పడదని వర్ష తెలిపారు.

తన బ్రదర్ కు యాక్సిడెంట్ కావడానికి ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కారణమని వర్ష వెల్లడించారు.ఆ ముగ్గురు వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల తన సోదరుడికి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురవడంతో పాటు కుటుంబం అంతా ఎంతగానో బాధ పడ్డామని వర్ష అన్నారు.వర్ష చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ ప్రమాదాలలో ఎక్కువ ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి.కొంతమంది వేగంగా వెళ్లాలనే ఆలోచనతో నిబంధనలను అతిక్రమించి వాహనాలను నడపటం వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.వర్ష పోస్ట్ వల్ల కొంతమందైనా మారతారేమో చూడాల్సి ఉంది.

డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలని పలువురు సెలబ్రిటీలు సైతం సూచనలు చేస్తున్నారు.

Video : Varsha Emotional Post About Her Brother Road Accident Goes Viral Details, Jabardasth Varsha, Varsha Brother, Road Accident, Driving, Varsha Emotional Post, Emmanuel, Jabardasth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube