ఇమ్మాన్యుయేల్ ను పెళ్లి చేసుకున్న వర్ష.. అసలేమైందంటే..?

మూడు రోజుల క్రితం జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున్న వర్ష తాళిబొట్టు, ఉంగరం ఫోటోలను షేర్ చేసి జులై 4వ తేదీన బిగ్ అనౌన్స్ మెంట్ అని చెప్పిన సంగతి తెలిసిందే.వర్ష షేర్ చేసిన ఫోటోలను చూసి చాలామంది వర్షకు పెళ్లి ఫిక్స్ అయిందని భావించారు.

 Varsha Emmanuel Marriage Promo Goes Viral In Social-TeluguStop.com

అయితే గతంలో సుధీర్ రష్మీ, రవికృష్ణ నవ్యస్వామిలతో చేయించిన విధంగా వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లి పేరుతో ఈటీవీ ఛానెల్ లో ఒక ఈవెంట్ ప్రసారం కానుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ నిర్వాహకులు షోపై ఆసక్తి పెంచడం కోసం వర్షతో అలాంటి ప్రకటన చేయించినట్టు తెలుస్తోంది.

 Varsha Emmanuel Marriage Promo Goes Viral In Social-ఇమ్మాన్యుయేల్ ను పెళ్లి చేసుకున్న వర్ష.. అసలేమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా ఆ ప్రోమోతో ఈ విషయం వెల్లడైంది.అయితే వర్ష చేసిన పనిపై కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

షో ప్రమోషన్స్ కోసం ప్రేక్షకులను మోసం చేసే విధంగా పోస్టులు పెట్టడం కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు.

ఇలాంటి ప్రమోషన్ల షోకు మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లిపీటలపై కూర్చోగా ఇమ్మాన్యుయేల్ వర్షకు తాళి కట్టినట్టు చూపించడం గమనార్హం.అయితే మరి కొందరు ఎంతమంది సెలబ్రిటీలకు పెళ్లిళ్లు చేస్తారని కొత్తగా ఆలోచించమని షో నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు.

మరి కొందరు నెటిజన్లు షో నిర్వాహకులు పెళ్లి గొప్పదనాన్ని చెడగొట్టేలా స్కిట్లు, ఈవెంట్లు చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.

గతంలో ప్రసారమైన పెళ్లికి సంబంధించిన ఈవెంట్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకున్నాయి.వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లికి సంబంధించిన ఈవెంట్ కూడా మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.ఇతర ఛానెళ్లు కూడా ఇదే తరహా పెళ్లి ఈవెంట్లను ప్లాన్ చేస్తుండటం గమనార్హం

.

#Goes Viral #Emmanuel #Marriage Promo #Social Media #Varsha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు