స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వర్ష.. ఏం జరిగిందంటే..?

ప్రముఖ ఛానెళ్లలో ఒకటైన ఈటీవీ ఛానెల్ లో సుధీర్ రష్మీ జంట లవ్ ట్రాక్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ జోడీకి ప్రత్యామ్నాయంగా వర్ష ఇమ్మాన్యుయేల్ జంట ఈ మధ్య కాలంలో పాపులారిటీని సంపాదించుకుంటోంది.

 Varsha Crying In Sridevi Drama Company Program Why Because,jabardhasth,sridevi D-TeluguStop.com

జబర్దస్త్ షోతో పాటు ఈటీవీలో జరిగే ఈవెంట్లలో ఎక్కువగా వర్ష, ఇమ్మాన్యుయేల్ జోడీ కనిపించడంతో పాటు ఇద్దరూ కలిసి చేస్తున్న స్కిట్లు సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Telugu Dad, Sridevidrama, Varsha-Movie

వాలెంటైన్స్ డే సందర్భంగా ఈటీవీ ఛానెల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో ఒక ప్రోగ్రామ్ ప్రసారం కాగా ఆ ప్రోగ్రామ్ కు ఇమ్మాన్యుయేల్ తో అతని ఫ్యామిలీ వచ్చారు.ఇమ్మాన్యుయేల్ మా అమ్మ ఆదమ్మ, తండ్రి అమరయ్య అంటూ తన తల్లిదండ్రులను ప్రేక్షకులకు పరిచయం చేశారు.తన అన్న గురించి చెబుతూ అన్న జీవితాన్ని త్యాగం చేసి తనను ఈ స్థాయిలో నిలబెట్టాడని ఇమ్మాన్యుయేల్ వెల్లడించారు.

అన్న ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి తనను ఈ స్థాయికి తీసుకొచ్చాడని ఇమ్మాన్యుయేల్ తెలిపారు.ఇమ్మాన్యుయేల్ తల్లి మైక్ తీసుకొని మాట్లాడుతూ మొదట పెద్దలందరికీ నమస్కారం చెప్పారు.

తన కొడుకు మంచి అబ్బాయని చెప్పలేనంత మంచి అబ్బాయని ఆమె చెప్పారు.ఇమ్మాన్యుయేల్ మనస్సు ఎంతో మంచిదని అన్నారు.

ఆ తరువాత వర్ష స్టేజ్ పైకి వచ్చి రీసెంట్లీ మిస్సింగ్ మై డాడీ అంటూ వర్ష కన్నీటి పర్యంతమయ్యారు.

ఇమ్మాన్యుయేల్ తనకు మంచి ఫ్రెండ్ ను ఇచ్చారని వర్ష చెప్పగా ఇమ్మాన్యుయేల్ వల్ల నీకు ఏ ప్రాబ్లమ్ రాదంటూ అతని తల్లి అన్నారు.

ఆ తరువాత హైపర్ ఆది స్టేజ్ పైకి వచ్చి ఎనిమిది సంవత్సరాల నుంచి జబర్దస్త్ నడుస్తోందని జబర్దస్త్ స్టేజ్ పై ఇప్పటివరకు ఇలాంటి జోక్ ఎవరూ చెప్పలేదని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube