‘చూసీ చూడంగానే’ పర్వాలేదనిపించిన నిర్మాత తనయుడు...

తెలుగులో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరు “చూసి చూడంగానే” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ చిత్రంలో శివ కందుకూరు సరసన వర్ష బొల్లమ్మ, మాళవిక సతేశన్ నటించారు.

 Varsha Bollamma Raj Shiva Kandukuri Choosi Choodangaane-TeluguStop.com

అయితే ఈ చిత్రానికి నూతన దర్శకురాలు సింధు రావు దర్శకత్వం వహించారు.

అయితే ఈ చిత్రం ట్రయాంగిల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఉండటంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుందని చెప్పాలి.

అంతేకాక నటన పరంగా పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ శివ కందుకూరి తన పాత్రకి వంద శాతం న్యాయం చేస్తూ తన హావభావాలను పలికించాడు.అయితే ఈ చిత్రం థియేటర్లలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

అంతేకాక ఇప్పటికే పలువురు సినీ విమర్శకులు శివ కందుకూరి నటనకు ఫిదా అయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Telugu Raj Kandukuri, Shiva Kandukuri, Tollywood, Varsha Bollamma-Movie

అయితే చిన్న తరహా చిత్రం అయినప్పటికీ ప్రమోషన్స్ బాగా చేసినందున  ప్రెక్షకులకి బాగా కనెక్ట్ అయ్యింది.అంతేగాక మధ్య మధ్యలో వచ్చేటువంటి తల్లి ప్రేమకు సంబంధించినటువంటి ఎమోషనల్ సీన్లు బాగా ఆకట్టుకున్నాయి.దీంతో ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద మరియు తెలుగు పరిశ్రమలో చూసి చూడంగానే చిత్రంతో శివ కందుకూరి తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube