మెగాస్టార్‌ బయోపిక్‌ గురించిన ముచ్చట్లు, వరుణ్‌ సై అంటున్నాడు  

Varnu Tej Comments On Megastar Chiran Jeevi Biopic-chiranjeevi Political Career,varnu Tej,varun Tej Valmiki Promotions

చిరంజీవి సినీ జీవితం సినిమా కంటే నాటకీయంగా ఉంటుంది.ఒక సామాన్యమైన కుర్రాడు మెగాస్టార్‌ స్థాయికి ఎలా చేరాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.అందుకే మెగాస్టార్‌ చిరంజీవి బయోపిక్‌ను తీయాలని చాలా మంది ఆశ పడుతున్నారు.తాజాగా వాల్మీకి ప్రమోషన్స్‌ సందర్బంగా హీరో వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతూ పెదనాన్న బయోపిక్‌పై తనకు చాలా ఆసక్తి ఉందని అన్నాడు.

Varnu Tej Comments On Megastar Chiran Jeevi Biopic-chiranjeevi Political Career,varnu Tej,varun Tej Valmiki Promotions-Varnu Tej Comments On Megastar Chiran Jeevi Biopic-Chiranjeevi Political Career Varnu Varun Valmiki Promotions

అన్న చరణ్‌ చేస్తే చూడాలని ఉందని చెప్పుకొచ్చాడు.ఒక వేళ చరణ్‌ చేయకపోతే నేను చేస్తానంటూ వరుణ్‌ ప్రకటించాడు.

Varnu Tej Comments On Megastar Chiran Jeevi Biopic-chiranjeevi Political Career,varnu Tej,varun Tej Valmiki Promotions-Varnu Tej Comments On Megastar Chiran Jeevi Biopic-Chiranjeevi Political Career Varnu Varun Valmiki Promotions

మెగాస్టార్‌ చిరంజీవి సినీ జీవితం మరియు రాజకీయ జీవితంను చూపించాలంటే ఒక మంచి దర్శకుడు అవసరం అవుతాడు.అలాంటి దర్శకుడు ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి.ఇదే సమయంలో చిరంజీవి సినీ కెరీర్‌ సాఫీగానే సాగినా రాజకీయ జీవితం మాత్రం కాస్త ఒడిదొడుకుల మద్య సాగింది.ఆ విషయాలను చూపించడం వల్ల మెగా ఫ్యాన్స్‌ బాధ పడే అవకాశం ఉంది.

అలాంటివి చూపించకుండా కేవలం మంచి మాత్రమే చూపిస్తే సినిమాకు పెద్దగా జనాలు కనెక్ట్‌ అవ్వరు.

ఇన్ని మెలికలు ఉన్న కారణంగా అసలు చిరంజీవి బయోపిక్‌కు మెగా ఫ్యామిలీ ఓకే చెప్పే అవకాశమే లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికి ఆ ఆలోచన లేకున్నా భవిష్యత్తులో అయితే ఖచ్చితంగా మెగా స్టార్‌ చిరంజీవి బయోపిక్‌ ఉంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నాడు.అందుకే ఆయన సినిమాల నుండి పూర్తిగా తప్పుకున్న తర్వాత అప్పుడు ఆయన గురించిన సినిమా తీస్తే బాగుంటుందని, ఇప్పటి నుండే వరుణ్‌ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కొందరు సూచిస్తున్నారు.