వారిని ఉరితీసే అవకాశం నాకు కల్పించండి, మహిళా షూటర్ విజ్ఞప్తి

హైదరాబాద్ లో ఇటీవల చోటుచేసుకున్న దిశ ఘటన నిందితులు పోలీసుల ఎంకౌంటర్ లో మృతి చెందడం తో దేశంలో ఒక్కసారిగా అత్యాచార నిందితుల పై వ్యతిరేకంగా డిమాండ్ లు మిన్నంటుతున్నాయి.ఈ నేపథ్యంలో 2012 లో దేశ రాజధాని ఢిల్లీ లో చోటుచేసుకున్న నిర్భయ నిందితులను ఇప్పటివరకు ఉరి తీయలేదని వారిని వెంటనే ఉరి తీయాలి అంటూ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.

 Varnika Wants To Hangnirbhaya Victims-TeluguStop.com

ఈ క్రమంలోనే రాష్ట్రపతి సైతం దోషులకు క్షమాబిక్ష సైతం తిరస్కరించడం తో ఇక వారందరిని కూడా ఉరికంబం ఎక్కించేందుకు తీహార్ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు.అయితే ఇటీవల వారికి ఉరితీయడం కోసం తమిళనాడు కు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

ప్రభుత్వం అనుమతి ఇస్తే వారిని ఉరి తీయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ లేఖ కూడా రాశారు.అయితే ఇప్పుడు తాజాగా ఆ దోషులను ఉరితీయడానికి నాకు అవకాశం కావలి అంటూ అంతర్జాతీయ మహిళా షూటర్ రక్తాక్షరాలతో కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తుంది.

మహిళా షూటర్‌ వర్టికాసింగ్‌ తన రక్తంతో కేంద్రానికి లేఖ రాసి,దోషులను ఉరితీసేందుకు అనుమతివ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరినట్లు తెలుస్తుంది.

Telugu Nirmbhaya, Hyderabad Disha, Thihar Jail, Varnika, Varnikahang-

దోషులను ఉరితీసే అవకాశం మహిళలకు ఇస్తే ప్రపంచానికి ఒక బలమైన సందేశం వెళుతుంది అని ఆమె అభిప్రాయపడ్డారు.మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే వారిని ఆ మహిళలే ఉరికి వేలాడదీస్తారన్న విషయం రేపిస్టులకు అర్ధం అవ్వాలని అందుకే ఈ విషయంగా అమిత్ షా కు స్పీడ్ పోస్టు లో లేఖను పంపినట్లు తెలిపారు.అంతేకాకుండా ఈ లేఖ ను ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసినట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube