రామ్ గోపాల్ వర్మ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు.ఆ వీడియోలో ఒక వ్యక్తి జింకను గన్‌తో పేల్చి ఆ తర్వాత జింకను ఒక గొర్రెను కనుక కోసినట్లుగా కోయడం ఉంది.
ఆ వీడియో వైరల్ అయ్యింది.జింకను వేటాడినందుకు సల్మాన్ ఖాన్‌ను కేసులు.
కోర్టులు అంటూ తిప్పుతున్నారు.కాని ఇతడిని మాత్రం ఏం చేశారంటూ వర్మ ప్రశ్నించాడు.
ఇండియాలో న్యాయం అనేది సల్మాన్‌కు ఒకలా ఇతరులకు మరోలా ఉంటుందా అంటూ వర్మ ప్రశ్నించడం అందరి దృష్టి ఆకర్షించింది.
వర్మ ప్రశ్నకు చాలా మంది సమాధానం చెప్పారు.
కాని పర్వీన్ అనే అటవి శాఖ అధికారి మాత్రం వర్మకే మైండ్ బ్లాంక్ అయ్యేలా రీ ట్వీట్ చేశాడు.మీరు అన్నట్లుగా న్యాయం ఎవరికైనా ఒక్కటే.అయితే ఆ వీడియోకు సంబంధించి న్యాయం విషయాన్ని అడగాలి అంటే మీరు బంగ్లాదేశ్ పోలీసులను ప్రశ్నించాలంటూ వర్మకు పర్వీన్ కామెంట్ పెట్టాడు.అంటే ఆ వీడియో బంగ్లాదేశ్‌లో జరిగింది.
దాన్ని పట్టుకుని వచ్చి వర్మ ఇక్కడ ఏదో హడావుడి చేసేందుకు ప్రయత్నించాడు.
వర్మ చేసిన హడావుడికి ఎప్పటిలాగే సోషల్ మీడియాలో నెటిజన్స్ రెస్పాండ్ అయ్యారు.వర్మను కొందరు తిడుతూ మరికొందరు పొగుడుతూ రెస్పాండ్ అయ్యారు.కాని ఇప్పుడు వర్మకు పర్వీన్ చేసిన కామెంట్‌తో అంతా కూడా పర్వీన్‌కు జై కొడుతున్నారు.
వర్మ పిచ్చి వీడియోలు తీసుకు వచ్చి ఇండియా పరువు తీస్తున్నావు అంటూ నెటిజన్స్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసేప్పుడు కాస్త వెనుకముందు చూసుకోవాలి కదా వర్మ అంటూ నెటిజన్స్ సలహా ఇస్తున్నారు.