టీడీపీ ఓటమి పై ఘాటుగా స్పందించిన వర్మ  

Varma Tweet About Tdp Loosing In The Elections-rgv Comments On Chandrababu Naidu,tdp,varma,ycp,ys Jagan,ysrcp

ఏపీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ దారుణంగా ఓటమి పాలవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తమదైన శైలి లో స్పందించారు. టీడీపీ ఆవిర్భావం మార్చి29,1982 అయితే మరణం మే 23,2019 అంటూ వర్మ ట్వీట్ చేసి ఆ పార్టీ పై తన కున్న కసిని తీర్చుకున్నారు. ఎన్నికల ముందు వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్ఠీఆర్ సినిమా విడుదల కు ఏపీ సర్కార్ అడ్డుపడిన సంగతి తెలిసిందే..

టీడీపీ ఓటమి పై ఘాటుగా స్పందించిన వర్మ -Varma Tweet About TDP Loosing In The Elections

ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అయితే పార్టీ కి దెబ్బ అవుతుంది అని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించి మరీ ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే వర్మ విజయవాడ వచ్చినప్పుడు కూడా వర్మను అడ్డుకున్న నేపథ్యంలో అప్పటినుంచి ఉన్న కసిని వర్మ ట్వీట్ చేసి తీర్చుకున్నాడు. టీడీపీ చచ్చిపోయింది అంటూ ట్వీట్ చేసారు. అలానే టీడీపీ ఓటమి కి గల కారణాలను కూడా వర్మ చెప్పుకొచ్చారు.

అబద్దాలు,.

వెన్నుపోట్లు, అవినీతి, అశక్తత, వై ఎస్ జగన్, నారా లోకేష్ ఇలా పలు కారణాలు టీడీపీ ఓటమికి కారణం అని వర్మ ట్వీట్ చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు తన మామ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు చేసిన మోసం గుర్తుకు వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ పార్టీ 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, టీడీపీ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.