ఆర్జీవీ మిస్సింగ్ నుంచి ఆసక్తికరమైన మరో క్యారెక్టర్ లుక్

లాక్ డౌన్ కాలంలో కూడా సినిమాలు తీసి రెండు చేతులా డబ్బులు సంపాదించిన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే ఆర్జీవీ పేరు చెప్పొచ్చు.డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ని అవకాశంగా వాడుకొని తన సినిమాల మీద ప్రజలకి ఉన్న క్యూరియాసిటీని క్యాష్ చేసుకుంటున్న ఆర్జీవీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

 Varma Released Fifth Look Poster From Rgv Missing, Mega Family, Rgv, Tollywood,-TeluguStop.com

అతను ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని కూడా ఏదో ఒక కాంట్రవర్సీ సబ్జెక్టుతోనే చేస్తూ ఉండటం విశేషం.వివాదాస్పద అంశానికి తనకి తోచినట్లు, నచ్చినట్లు కొత్తకోణాన్ని ఆపాదించి ప్రేక్షకుల మీదకి వదిలేస్తూ ఉన్న ఆర్జీవీ ఇప్పుడు తన పేరుతోనే ఒక సినిమాని తెరపైకి తీసుకొచ్చాడు.

ఆర్జీవీ మిస్సింగ్ అంటూ ఆ మధ్య ట్విట్టర్ లో ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు.అందులో బ్రేకింగ్ న్యూస్… అంటూ ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడని, పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతని కుమారుడు అనుమానితులని పేర్కొన్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్ ని ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు.ఇందులో ఆర్జీవీ మిస్సింగ్ కేసుని డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ గజినీకాంత్ అంటూ రజినీకాంత్ గెటప్ లో ఉన్న లుక్ రివీల్ చేశాడు.

ఇతనో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని వెల్లడించారు.ఇతనిలో ఎవరి పోలికలైనా కనిపిస్తే అది కేవలం కాకతాళీయమేనని పేర్కొన్నారు.ఆ తర్వాత మరో ట్వీట్ లో ఇతని పేరు గజినీకాంత్ అంటూ వెల్లడించారు.మొత్తానికి ఆర్జీవీ తన సినిమా కోసం ఇప్పుడు రజినీకాంత్ ని కూడా వాడుకుంటున్నాడు.

మెగా ఫామిలీని టార్చర్ చేయడమే పనిగా పెట్టుకున్న ఆర్జీవీ తన ఆర్జీవీ మిస్సింగ్ సినిమాలో ఎం చెప్పబోతున్నాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube