వర్మ కొత్త సినిమా బడ్జెట్‌ రూ. 5 లక్షలు

తెలుగు వెండి తెరపైనే కాకుండా ఇండియన్‌ స్క్రీన్‌పై అద్బుతాలు ఆవిష్కరించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ.ఈయన శివ సినిమా నుండి మొదలుకుని ఎన్నో అద్బుతాలను ఆవిష్కరించాడు.

 Ram Gopal Varma, Rgv, Nagnam Mvoie, Budget, Nagnam Movie Budget 5 Lakhs-TeluguStop.com

కాని గత కొన్ని సంవత్సరాలుగా మాత్రం వర్మ సినిమాల మేకింగ్‌ విషయంలో ఏమాత్రం సీరియస్‌గా వ్యవహరించడం లేదనిపిస్తుంది.టైం పాస్‌కు సినిమాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

వర్మ తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.అయినా కూడా ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకుండా వర్మ సినిమాలు తీస్తూ వస్తున్నాడు.

ఈమద్య వర్మ అడల్ట్‌ సినిమాలపై దృష్టి పెట్టాడు.మొన్నటికి మొన్న క్లైమాక్స్‌ చిత్రంను తెరకెక్కించి డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ మీద విడుదల చేసిన వర్మ తాజాగా నగ్నం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.

ఈ సినిమాను చూడాలంటే ప్రేక్షకులు 200 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది.రామ్‌ గోపాల్‌ వర్మ నగ్నం సినిమాను కేవలం 5 లక్షల రూపాయలతో తెరకెక్కించాడు.కేవలం బుకింగ్స్‌ ప్రారంభం అయిన గంట వ్యవధిలోనే వర్మ పెట్టిన పెట్టుబడి వచ్చిందట.

నగ్నం సినిమాను వర్మ ఒకే ఇంట్లో అతి తక్కువ మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులతో కొన్ని రోజుల్లోనే తెరకెక్కించాడు.

వర్మ ఈ సినిమాతో కనీసం కోటి రూపాయలైనా సంపాదించే అవకాశం ఉందంటున్నారు.వర్మ తనకు ఉన్న పేరుతో ఇలా బిజినెస్‌ చేస్తున్నాడు.కాని ఆయన క్రేజ్‌కు తగ్గట్లుగా మాత్రం సినిమాలు చేయడం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube