అవసరం ఉంటే కాళ్లమీద పడడం లేదంటే సీన్లు క్రియేట్ చేయడం

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ వివాదాస్పద టైటిల్ తో ప్రస్తుత ఏపీ రాజకీయాలపై ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా నిర్మాణం పూర్తి చేసిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి ఇప్పటికే వర్మ ట్రైలర్స్ ను కూడా విడుదల చేసాడు.

 Varma Jivitha Rajashekar Kapaul-TeluguStop.com

అయితే ఈ సినిమాపై అనేక అభ్యంతరాలు రావడం, సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం తెలిపే అవకాశం ఉండడంతో ఆ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ ను మార్చదు వర్మ.అయినా ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి.

కొన్ని షరతుల మీద ఈ సినిమా ఈనెల 12వ తేదీన విడుదల చేసేందుకు కోర్టు కూడా అంగీకారం తెలిపింది.ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల కాకుండా నిలిపివేయాలంటూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్కైప్ ద్వారా మాట్లాడారు.ఈ సినిమా వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని, ఆ పార్టీ ఆర్థిక అండదండలతోనే ఈ సినిమా తీశారని కె ఏ పాల్ విమర్శించారు.

ఈ సినిమాలో ఫోటోలు మార్ఫింగ్ చేశారని, సెన్సార్ బోర్డు కూడా సరైన రీతిలో వ్యవహరించడం లేదు అంటూ కే ఏ పాల్ చెప్పుకొచ్చారు.అలాగే సినీనటి జీవిత రాజశేఖర్ చాలా అవినీతి పరురాలని వారి దగ్గర డబ్బులు లేవు అంటే తాను 2017 లో 20 లక్షల రూపాయలు ఇచ్చానని, కానీ ఇప్పటికీ వాటిని తిరిగి ఇవ్వలేదంటూ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రామ్ గోపాల్ వర్మకు కావాల్సింది వివాదమని, ఆయన అవసరం ఉంటే కాళ్ల మీద పడతాడని, డబ్బులు ఇవ్వకపోతే సీన్లు క్రియేట్ చేస్తాడని కె ఏ పాల్ విమర్శలు చేశారు.ఈ సినిమా విడుదలైతే తెలుగు రాష్ట్రాలు అల్లర్లు జరుగుతాయని కాబట్టి ఈ సినిమాను ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని పాల్ విజ్ఞప్తి చేశారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube