దయ్యం సినిమా షూటింగ్ చేసానని 20 ఏళ్లుగా ఆ ఇంటిని ఎవరు కొనడం లేదు : వర్మ

భయం మనిషి చేత ఎలాంటి పనైనా చేయిస్తుంది అదే భయం మనిషిని ఎప్పటికీ ఉన్నచోట నుంచి కదలనివ్వదు.అలా ఒక స్థలం లేదా ఒక ప్రాంతం ఏదైనా భయం కలిగించే విషయం ఉందంటే జనాలు ఎవ్వరూ కూడా అటువైపు వెళ్లడానికి ఇష్టపడరు.

 Varma Bhoot Movie Aprtment Abonded, Bhoot Movie, Ram Gopal Varma , Tollywood ,-TeluguStop.com

అందులో నిజా నిజాలతో ఎవరికీ సంబంధం లేదు కానీ భయం సెంటిమెంట్ ని గట్టిగా ఫాలో అవుతూ ఉంటారు అందరూ.అలాంటి ఒక సంఘటనే ఒక అపార్ట్మెంట్ విషయంలో జరిగింది.

అది కూడా దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రభావం కావడం విశేషం.మరి వర్మకి ఈ భయం కల్పించే ఆ అపార్ట్మెంట్ కి ఉన్న సంబంధం ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Ajay Devgan, Bollywood, Ram Gopal Varma, Tollywood, Urmila, Varma-Latest

వర్మ 2003 లో హర్రర్ మూవీ బూత్ కి దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఆరు కోట్ల బడ్జెట్ తో తీస్తే దాదాపు దానికి నాలుగు రెట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది.సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టే విధంగా ఉంటాయి ఈ సినిమాలోని సీన్స్ అన్నీ కూడా.ఇక బూత్ సినిమాలో అజయ్ దేవగన్ మరియు ఊర్మిళ మెయిన్ లీడ్ గా నటించారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ముంబైలోని వీర దేశాయ్ రోడ్ లో ఒక అపార్ట్మెంట్ లో జరిగింది.ఈ సినిమా షూటింగ్ అంతా దయ్యం కాన్సెప్ట్ తో రావడంతో ఈ ఫ్లాట్ లో నిజంగానే ఆత్మలు తిరుగుతున్నాయి అనే ప్రచారం గట్టిగా జరిగింది.

Telugu Ajay Devgan, Bollywood, Ram Gopal Varma, Tollywood, Urmila, Varma-Latest

2003 నుంచి నేటి వరకు ఈ అపార్ట్మెంట్ ప్లాట్స్ లో ఎవరు దిగకపోవడం ఆశ్చర్యకరం.నేటికి కూడా ఆ ఫ్లాట్ ఖాళీగా ఉండి అటు సైడు ఎవరైనా వెళ్లడానికి జంకుతున్నారు అంటే ఆలోచించండి.ఈ విషయం ఇటీవల రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆర్జీవి సినిమా వల్ల ఇలా ఒక ఇల్లు బూత్ బంగ్లా గా మారిపోవడం పట్టి చూస్తే జనాలకు ఏ టైంలో ఎలాంటి సెంటిమెంట్స్ బలంగా తాకుతాయో ఎవరు చెప్పగలరు చెప్పండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube