లోకేష్‌ పప్పు, జగన్‌ పిడత కింద పప్పు  

Varlla Ramaiah Comments On Jagan Mohan Reddy-tdp Chief Chandrababu Naidu,varlla Ramaiah

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగు దేశం పార్టీని వీడి పోతూ పోతూ అధినేత చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను తీవ్ర స్థాయిలో విమర్శలతో గుప్పించిన విషయం తెల్సిందే.ఇన్ని రోజులు తెలుగు దేశం పార్టీలో ఉన్న వంశీ బయటకు వెళ్లిన వెంటనే మాట్లాడిన మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయంటూ టీడీపీ నాయకులు అంటున్నారు.వంశీ ఒక ప్రెస్‌ మీట్‌లో మాట్లాడుతూ లోకేష్‌ను పప్పు అంటూ సంభోధించాడు.దాంతో టీడీపీ నాయకుడు వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

Varlla Ramaiah Comments On Jagan Mohan Reddy-tdp Chief Chandrababu Naidu,varlla Ramaiah Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage-Varlla Ramaiah Comments On Jagan Mohan Reddy-Tdp Chief Chandrababu Naidu

వంశీ చేసిన వ్యాఖ్యలకు వర్ల రామయ్య సీరియస్‌ అయ్యాడు.ఈ సందర్బంగా వర్ల రామయ్య మాట్లాడుతూ.నారా లోకేష్‌ చిన్నప్పటి నుండి ఇంగ్లీష్‌ మీడియంలో చదివి అత్యున్నత అమెరికా యూనివర్శిటీలో చదివాడు.కనుక ఆయన తెలుగు మాట్లాడటంలో కొన్ని తప్పులు దొర్లుతాయి.

అంత మాత్రన పప్పు అంటారు.అలా అయితే జగన్‌ను పిడత కింద పప్పు అనాలంటూ వర్ల రామయ్య అన్నాడు.సీఎం జగన్‌ ఏం చదివాడో కూడా క్లారిటీ లేదని, నిరక్ష రాస్యత అనే పదాన్ని స్పష్టంగా పలకలేని సీఎం జగన్‌ అంటూ ఎద్దేవ చేశాడు.లోకేష్‌కు పప్పు అంటూ పేరు పెట్టిన వంశీ సీఎం జగన్‌కు కూడా ఏదైనా పేరు పెట్టాలంటూ ఈ సందర్బంగా వర్ల రామయ్య సూచించాడు.