టిడిపి నేత వర్ల రామయ్య, వైసీపీ మంత్రి పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశాడు.సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఉద్యోగులు ఎస్ఈసి మాట వినరు అనడం వెనక రాజకీయ సంక్షోభం సృష్టించడమే అవ్వుతుందని అన్నాడు.
రాజ్యాంగం మీది ప్రమాణం చేసి మాట తప్పారని వెంటనే ఆయన్ను క్యాబినెట్ నుండి భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశాడు.పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డి ఈ వ్యాఖ్యలు చెయ్యడం వెనక కారణం ఏమిటి అంటే ఎస్ఈసి కి రాష్ట్ర ప్రభుత్వం కు మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయమై అంతర యుద్దం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఎన్నికలను నిర్వహించడానికి వీల్లేదని చెబుతుంది.రాష్ట్ర ఎస్ఈసి మాత్రం ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యం అయిందని భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురు అవ్వుతాయని ఆరోపిస్తుంది.
ఈ విషయంపై ఈ రెండు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయిస్తే ఎన్నికలపై స్టే ఇచ్చింది.ఈ విషయంపై నిమ్మగడ్డ సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు.త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది.కాసేపటి క్రితమే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశాడు.
ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి ఎస్ఈసి పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం చర్చనీయాంశం గా మారింది. బైలాస్ కు వ్యతిరేకంగా రాష్ట్ర పోలీసు ఆఫీసర్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ పనిచేస్తున్నారని ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకును తక్షణమే సస్పెండ్ చెయ్యాలని రాష్ట్ర డిజిపి సవాంగ్ గారికి వర్ల రామయ్య ట్వీట్ చేశాడు.