వివేక హత్య కేసులో వర్ల రామయ్యకు నోటీసులు  

Varla Ramaiah Comments On Y.s. Vivekanandha Reddy Murder Case-varla Ramaiah,ys Vivekanandha Reddy

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తుకు సిట్‌ ను ప్రభుత్వం నియమించిన విషయం తెల్సిందే.ఈ హత్య కేసులో పలు అనుమానాలు, అనుమానితులను దర్యాప్తు బృందం వారు విచారిస్తున్న విషయం తెల్సిందే.

Varla Ramaiah Comments On Y.s. Vivekanandha Reddy Murder Case-varla Ramaiah,ys Vivekanandha Reddy-Varla Ramaiah Comments On Y.S. Vivekanandha Reddy Murder Case-Varla Ys

ఈ సమయంలోనే తెలుగు దేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య పదే పదే వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు పంపించారు.మీరు పదే పదే ఈ కేసు విషయంలో మాట్లాడుతున్న కారణంగా కేసు పక్క దోవ పట్టే ప్రమాదం ఉంది.

Varla Ramaiah Comments On Y.s. Vivekanandha Reddy Murder Case-varla Ramaiah,ys Vivekanandha Reddy-Varla Ramaiah Comments On Y.S. Vivekanandha Reddy Murder Case-Varla Ys

మీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను పట్టుకుని సిట్‌ ముందు హాజరు అవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.వెంటనే హాజరు కాకుంటే కోర్టు ద్వారా మిమ్ములను అప్రోచ్‌ అవ్వాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు.

ఈ నేపథ్యంలో వర్ల రామయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యకేసును మరుగున పడేసేందుకు తనను ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.