బీజేపితో వెళ్తే అంతే సంగతులు ? మిత్రపక్షాల్లో వణుకు ? 

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు లేనంత స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోవడం సామాన్య ప్రజలు అందుబాటులో లేకుండా పోయిన నిత్యావసరాల ధరలు, పెట్రోల్ , గ్యాస్, డీజిల్ ధరల పెరుగుదలతో పాటు, రెండోసారి విజృంభిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ఇలా ఎన్నో అంశాల కారణంగా కేంద్ర ప్రభుత్వంపై జనాల్లో ఆగ్రహం కనిపిస్తోంది.

 Various Political Parties Are Afraid To Alliance With Bjp-TeluguStop.com

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనంగా ఉండడంతో, బిజెపి హవా నడుస్తోంది.కానీ ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో బీజేపీకి అవకాశం దొరకడం లేదు.

దీనికి ఉదాహరణగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది.కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవా నడిచింది.

 Various Political Parties Are Afraid To Alliance With Bjp-బీజేపితో వెళ్తే అంతే సంగతులు మిత్రపక్షాల్లో వణుకు  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అక్కడ బిజెపి గెలిచేందుకు ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా, ప్రాంతీయ పార్టీల బలం ముందు చిత్తు కావాల్సి వచ్చింది.కానీ పుదుచ్చేరి, అసోమ్ విషయానికి వస్తే అక్కడ బీజేపీకి అధికారం దక్కింది అంటే అది ఆ పార్టీ గొప్పతనం అని చెప్పేకంటే కాంగ్రెస్ అక్కడ బలహీనంగా ఉండడమే బీజేపీకి విజయాన్ని తెచ్చిపెట్టాయి అని చెప్పుకోవాలి.

అసలు బీజేపీకి ఈ పరిస్థితి రావడానికి దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న సంఘటనలు ప్రధాని నరేంద్ర మోదీ పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చకపోగా, మరిన్ని కష్టాలపాలు అవ్వడం, ఇలా ఎన్నో కారణాలు బీజేపీ గ్రాఫ్ బాగా తగ్గించి వేశాయి.

Telugu Alliance With Bjp, Amithsha, Ap, Asom, Bjp, Central Government, Congress, Corona Second Wave, Corona Vaccine, India Politics, Kerala, Narendra Modi, Nda, Political Parties, Regional Parties, Tamilanadu, West Bengal-Telugu Political News

ఇక ఈ కరోనా వ్యాక్సిన్ ఇప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం కూడా బీజేపి కి పెద్ద తలనొప్పిగా మారింది.ఈ పరిణామాలన్నీ బీజేపీ కంటే, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని మిత్రపక్షంగా కొనసాగుతున్న వివిధ రాజకీయ పార్టీలకు ఆందోళన పెంచుతున్నాయి.బిజెపి గ్రాఫ్ తో తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని ఇప్పటి వరకు భావిస్తూ వచ్చిన మిత్రపక్షాలలో బిజెపి కారణంగా రానున్న రోజుల్లో తాము మరింత కష్టాలపాలు అవుతామనే అభిప్రాయం ఏర్పడింది.

ఇప్పటికే ఎన్డీయే నుంచి అనేక పార్టీలు బయటికి వెళ్లిపోయిన తరుణంలో, రాబోయే ఎన్నికల నాటికి బిజెపి హవా తగ్గిపోతుందని, మళ్ళీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడే అవకాశమే లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.

#Kerala #Narendra Modi #Asom #Corona Vaccine #India Politics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు