ఆమెకి 23 , అతనికి 13 వారిద్దరికీ పెళ్లి .. చివరికి ఏమయిందో చూస్తే షాక్ అవుతారు , తప్పక చూడండి  

  • బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వం సరైన అవగాహన సదస్సు లు ఏర్పరచినప్పటికి ఇంకా చాలా గ్రామాల్లో ఇంకా బాల్య వివాహాలు జరుపుతున్నారు , దీని వల్ల చాలా సమస్యలు ఏర్పడుతాయి.

  • సాధారణంగా బాల్య వివాహాల్లో వధువుకు చిన్న వయస్సు…వరుడు ఆమె కంటే చాలా పెద్ద వయస్సుతో ఉంటారు. అయితే కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన దీనికి భిన్నంగా ఉంది. ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు 10 సంవత్సరాలు పెద్ద కావడం గమనార్హం. అంతేకాదు అసలు ఇలాంటి పెళ్లి చేయడం పెద్ద నేరం కూడా. అయినా మరి అవగాహన లేకో…లేక చట్టాలు ఏం చేస్తుందనుకున్నారో

  • కానీ…ఇరువర్గాల పెద్దలు ఒక బాలుడిని చిన్నారి పెళ్లికొడుకుగా మార్చేశారు. అసలు కథ ఏంటంటే

  • కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలం కౌతాళం సమీపంలోని ఓ చిన్న గ్రామంలో వారం క్రితం 13 ఏళ్ల బాలుడికి దాదాపు 23 ఏళ్ల యువతితో పెళ్లి జరిగింది. ఇది మారుమూల ప్రాంతం కావడం అక్కడివారికి ఇలా పెళ్లి చేయడం నేరమనే అవగాహన లేకపోవడం వల్ల పెళ్లి మాములుగా జరిగిపోయింది. అయితే ఈ పెళ్లికి హాజరైనవారు ఎవరో సెల్ ఫోన్ లో ఈ పెళ్లి ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తరువాత ఇది వైరల్ గా మారింది. దానివల్ల ఈ బాల్య వివాహం విషయం వెలుగులోకి వచ్చింది.

  • Variety Wedding 13 Years Boy Marries 23 Girl-23 Girl Kowthalam Mandal In Kurnool

    Variety Wedding 13 Years Boy Marries 23 Years Girl

  • భర్త తాగడానికి బానిస కావడం, తన ఆరోగ్యం దెబ్బ తినడంతో తాను చనిపోతే కుటుంబాన్ని పట్టించుకునేవారు ఎవరనే ఆందోళనతో ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెల సంతానం ఉన్న ఒకతల్లి తీసుకున్న నిర్ణయం ఇది. తన కొడుకుల్లో పెద్దవాడికి 13 ఏళ్లే అయినా వాడికి పెళ్లి చేస్తే వచ్చే కోడలు తన తదనంతరం కుటుంబాన్ని చూసుకుంటుందనే ఆలోచనతో ఆమె ఈ పెళ్లి జరపాలని అనుకుంది.

  • కొడుక్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ఆమె తమ దూరపు బంధువుల్లోనే పెళ్లీడుకొచ్చిన ఒకమ్మాయిని చూసి ఏప్రిల్‌ 27న ఈ పెళ్లి జరిపించినట్లు తెలిసింది. దీంతో 13 ఏళ్ల వయస్సున్న బాలుడు తనకంటే సుమారు 10 సంవత్సరాలు పెద్దదైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో విషయం తెలీక ఈ పెళ్లికి వచ్చిన వారంతా షాక్ గురైనట్లు సమాచారం. అక్కడ ఉన్న కొంత మంది ఈ విషయం తెలిసి పెళ్లి అపాలనుకున్న అపలేకపోయారు. ఏది ఏమైనా ఈ పెళ్లి వీడియో నెట్ లో హల్ చల్ చేస్తుంది.