ఇతనో వెరైటీ దొంగ..మంచి పనులు చేస్తూ దొరికిపోయాడు..       2018-06-25   02:48:48  IST  Raghu V

ఇదొక వింత దొంగ స్టొరీ దొంగ స్టొరీ అంటే దొబుకొచ్చింది అనుకునేరు నిజంగా గుజరాత్ లో జరిగిన ఘటన ఇది వివరాలలోకి వెళ్తే.. గుజరాత్ కి చెందిన రమేష్ రావత్ అనే వ్యక్తి ముంబై లో ఓ ఓ కొరియర్ కంపెనీలో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి ఆ కంపెనీలోనే రూ.80 లక్షలు దోచుకెళ్లాడు..అయితే దొంగతనం చేసిన రోజు మొదలు తనకి మనసు అస్సలు సరిగా లేదట వారి డబ్బు అనవసరంగా దొంగిలిచాను అంటూ రోజు భాదపదేవాడట..దాంతో ఈ దొంగ చేసిన ఆలోచనని ఆచరణలో పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు..

-

రావత్ రాను చేసిన దొంగతనానికి ప్రాయశ్చిత్తం గా దానాలు చేయడం మొదలు పెట్టాడు..దోపిడీ అనంతరం మధుర నగరానికి వచ్చిన రమేష్ రావత్ తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు మితిమీరిన దానాలు చేయడం ప్రారంభించాడు…రమేష్ మధురలోని ఓ ఆలయంలో రూ.8 లక్షలు వెచ్చించి భజన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాదు అక్కడకియా వచ్చిన భక్తులకి ఒక్కొక్కరికి రెండువేల రూపాయల నోట్లను పంపిణీ చేశాడు.

అక్కడితో ఆగకుండా యమునా నదిలో కృష్ణుడి భక్తులు స్నానాలు చేస్తూ మరణిస్తున్న నేపథ్యంలో వారి రక్షణ కోసం రూ.3లక్షలతో ఓ స్టీమరును కొని అక్కడ బహుమతిగా ఇచ్చాడు..అయితే ఈ దానాలు చేస్తూ ఉండటంతో మధుర లో పోలీసులకి అనుమానం వచ్చింది..దాంతో మధుర పోలీసులు అతని గురించి దర్యాప్తు చేయగా ముంబైలో రూ.80లక్షలు దోపిడీ చేశాడని వెలుగుచూసింది. అంతే ముంబై పోలీసులను రప్పించి వారితో కలిసి మధుర పోలీసులు రమేష్ రావత్ ను కటకటాల్లోకి నెట్టారు…రావత్ దగ్గర నుంచీ ఖరీదైన ఐ ఫోన్స్ 5 స్వాధీనం చేసుకున్నారు. ఘటన మధుర నగరంలో సంచలనం రేపింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.