వెరైటీ జాతర: జంటల డ్యాన్స్ లు,ముద్దులు

జాతర అంటే ఎవరైనా ఇష్టదైవాలను పూజలు,మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు అందరూ.వీటి కోసం అందరూ పొద్దున్నే లేచి చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ కలిసి జాతర పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

 Variety Festival Celebrating In Karnataka State-TeluguStop.com

కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొని జాతర లో సందడి చేస్తూ ఉంటారు.అయితే ఈ జాతర లో ఇష్టదైవాలను పూజలు,పునస్కారాలు,ఊరేగింపులు,సేవలు,రధం ఇలా అన్ని హంగులతో జాతర అనేది జరుగుతుంది.

అయితే కర్ణాటక లో మాత్రం ఒక వెరైటీ జాతర జరుగుతుందట.అయితే ప్రతి పదేళ్ల కు ఒక్కసారే ఇలాంటి వెరైటీ జాతర జరుగుతుంది.

కర్ణాటక లోని బళ్లారి పరిసర ప్రాంతాల్లో దావణగెర జిల్లా పరిధిలోని మాగానహళ్లి గ్రామంలో ఈ స్పెషల్ జాతర జరుగుతుంది.గ్రామ దేవత జాతరలో భక్తులు జంటలుగా పాల్గొని డ్యాన్స్ లు చేయడా,ముద్దులు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు.

ఆ తిరునాళ్లకు వచ్చే భార్యాభర్తలు కలిసి డ్యాన్స్ చేయటమే కాకుండా జాతర కు వచ్చిన ఆ జన సమూహం లోనే ఆ జంట పబ్లిక్ గా ముద్దులు పెట్టుకోవాలంటే.ఇదే ఆ జాతర సాంప్రదాయం అని స్థానికులు చెబుతున్నారు.

ఈ వింత సాంప్రదాయం పదేళ్ల కు ఒక్కసారి జంటలు ఆచరిస్తూ ఉంటాయట.ఇలా చేస్తేనే అమ్మవారు శాంతించి సంతృప్తి చెందుతారని,కోరిన కోరికలు తీరుతాయి అని అక్కడి జనాల నమ్మకమట.

మొత్తానికి ఈ వింత జాతర గురించి వింటే మాత్రం ఇలాంటి జాతర్లు కూడా జరుగుతాయా అన్న అనుమానాలు రాకమానవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube