జపాన్ లో కనిపించిన విచిత్ర ప్రాణి సోషల్ మీడియా లో వైరల్

జపాన్ లో ఒక విచిత్రమైన ప్రాణి కనిపించింది.వాస్తవానికి అది చూడడానికి కాకిలా కనిపించినా అది నిలుచున్న తీరును చూస్తే మాత్రం ఒక గొరిల్లా పిల్ల లాగా కనిపిస్తుండడం విశేషం.

 Variety Crow In Japan It Looks Like Baby 2 Telugustop Gorilla-TeluguStop.com

జపాన్ లోని నగోయా ప్రాంతంలో ఒక ఇంటి ప్రాంగణం లో ఈ విచిత్ర ప్రాణి దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరచింది.అయితే కాకి జాతి లో ఇదో కొత్త జంతువు అయి ఉంటుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే వాషింగ్టన్ యూనివర్సటీ పరిశోధకులు మాత్రం అది కాకే అని అయితే తన కాళ్లను,రెక్కలను ఒకే చోట చేర్చినప్పుడు అది అలా కనపడింది అని అంటున్నారు.అంతేకాకుండా దాని హెడ్ యూనిట్ కూడా విశాలంగా ఉండడం వల్ల అది కాకి కాదు గొరిల్లా పిల్ల అన్నట్లు కనిపించింది అని పరిశోధకులు అంటున్నారు.

అయితే కిటారో సింప్సన్ అనే ట్విటర్ యూజర్ ఈ కాకి గారిని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.ఇక అంతే ఈ ‘ కాకి ‘ కాని ‘ కాకి ‘ గారి వైనాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో కు ఒక్కసారిగా 90 లక్షల వ్యూస్ వచ్చి పడ్డాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అన్న విషయం.ఇలాంటి పక్షిని తామెప్పుడూ చూడలేదని, ప్రకృతిలో ఇదో వింత జీవి అని అనని వాళ్ళు లేరు.

ఈ వీడియోను వేలాదిమంది షేర్ చేసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube