వైరల్‌ : ఆఫీస్‌ స్టాప్‌ కాఫీ నియంత్రణకు యాజమాన్యం వింత ప్రయత్నం.. కాఫీ చూస్తేనే ఇప్పుడు వాంతులు చేసుకుంటున్నారు  

Variety Coffee Machine In Japan-

సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగస్తులు రిలాక్స్‌ అయ్యేందుకు కాఫీ మిషన్‌లు ఏర్పాటు చేస్తూ ఉంటారు.కాఫీ మిషన్‌తో ఎంత కాఫీ అయినా ఎంప్లాయిస్‌ తాగేందుకు అవకాశం ఉంటుంది.ఇదే అదునుగా కొందరు గంటకు ఒక కాఫీ చొప్పున లాగిస్తూ ఉంటారు...

Variety Coffee Machine In Japan--Variety Coffee Machine In Japan-

మిషన్‌ కాఫీ ఎక్కువ శాతం మందికి ఆసక్తి ఉండదు.కాని కొందరు మాత్రం దాన్ని ఇష్టంగా తాగుతూ ఉంటారు.జపాన్‌లోని ఒక కంపెనీలో కాఫీ మిషన్‌ ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ కాఫీని పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు తాగుతూ ఉన్నారు.వారిని వద్దని చెప్పలేని పరిస్థితి దాంతో యాజమాన్యం వింత ఐడియాతో వారికి చెక్‌ పెట్టింది.

Variety Coffee Machine In Japan--Variety Coffee Machine In Japan-

కాఫీ మెషన్‌కు ఒక బొమ్మను ఏర్పాటు చేశారు.అదే సమయంలో కాఫీ వచ్చే సమయంలో వింత శబ్దాలు వచ్చేలా కూడా క్రియేట్‌ చేశారు.

దాంతో కాఫీ తాగాలనుకున్నా అది చూడగానే వినగానే తాగాలనిపించదు.ఇంతకు ఆ బొమ్మ ఎలా ఉందో మీరు పైన ఫొటోలో చూడవచ్చు.ఒక వ్యక్తి మోషన్‌ పోతున్నట్లుగా ఉండటంతో పాటు, ఆ సమయంలో శబ్దం ఎలా అయితే వస్తుందో అలాగే క్రియేట్‌ చేయడం జరిగింది...

మొత్తానికి అది పెట్టినప్పటి నుండి కూడా ఒక్కరు ఇద్దరు తప్ప ఎవరు కూడా కాఫీ తాగేందుకు ఆసక్తి చూపడం లేదు.

యాజమాన్యం కాఫీ తాగవద్దనకుండా ఇలా చేయడంతో ఎంప్లాయిస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరీ ఇంత నీచంగా ప్రవర్తించడం ఏంటీ అంటూ కొందరు బయటకు అనుకోకున్నా తమలో తాము చర్చించుకుంటున్నారు.కాఫీ తాగాలంటేనే విరక్తి పుడుతుందని, అంత నీచంగా ఎలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరహా విధానం కేవలం అక్కడ మాత్రమే కాకుండా జపాన్‌ మరియు చైనాలో పలు చోట్ల ఇదే తరహాలో ఉంది.ఇప్పుడు జపాన్‌లోని ఆ కంపెనీ వారు తీసుకు వచ్చారు...

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

..