ప్రపంచంలోనే అత్యంత వింత యాక్సిడెంట్‌... సైకిల్‌ ను ఢీ కొట్టిన కారుకు పెద్ద డ్యామేజీ, సైకిల్‌ బాగానే ఉంది     2019-01-05   09:41:09  IST  Ramesh Palla

ఎక్కడైనా యాక్సిడెంట్‌ జరిగితే పెద్ద వాహనం వల్ల చిన్న వాహనం గుల్ల గుల్ల అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కారు, లారీ ఢీ కొంటే కారు నుజ్జు నుజ్జు అవ్వడం, కారు, బైక్‌ ఢీ కొంటే బైక్‌ నుజ్జు నుజ్జు అవ్వడం, బైక్‌ మరియు సైకిల్‌ ఢీ కొంటే సైకిల్‌ డ్యామేజీ అవ్వడం మనం ఇప్పటి వరకు చూశాం. కారు కింద పడ్డ సైకిల్‌ మళ్లీ పనికి రాకుండా అవ్వడం కూడా మనం గతంలో ఎన్నో సార్లు చూశాం. కాని ఈసారి మాత్రం పరిస్థితి రివర్స్‌ అయ్యింది. చిన్న వెయికిల్‌ ను ఢీ కొట్టిన పెద్ద వెయికిల్‌ కు డ్యామేజీ అయ్యింది. ఇది ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన యాక్సిడెంట్‌గా దీనికి క్రెడిట్‌ దక్కింది.

Variety Accident In The World Car Squashed Collision With Bicycle-Car Front Bumper Of

Variety Accident In The World Car Squashed In Collision With Bicycle

యాక్సిడెంట్‌ పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనాలోని షెంజెన్‌ నగరంలో ఈ విచిత్ర యాక్సిడెంట్‌ చోటు చేసుకుంది. కాస్త స్లోగా వస్తున్న కారును చాలా స్పీడ్‌గా వస్తున్న సైకిల్‌ వ్యక్తి ఢీ కొట్టాడు. ఆ ధాటికి సైకిల్‌పై ఉన్న వ్యక్తి కింద పడి పోయాడు. అయితే సైకిల్‌ కారులో ఇరుక్కు పోయింది. సైకిల్‌ కు పెద్దగా డ్యామేజీ ఏమీ లేదు. కాని కారు మాత్రం చాలా డ్యామేజీ అయ్యింది. ముందు బంపర్‌ లోనికి వెళ్లడంతో పాటు, హెడ్‌ లైట్‌ కూడా పగిలి పోయింది.

Variety Accident In The World Car Squashed Collision With Bicycle-Car Front Bumper Of

కారు బంపర్‌ బెండ్‌ వచ్చేలా సైకిల్‌తో ఆ వ్యక్తి స్పీడ్‌గా ఢీ కొట్టాడు. అయితే ఈ యాక్సిడెంట్‌లో సైకిల్‌కు ఏమీ కాకపోవడం అత్యంత చర్చనీయాశం అయ్యింది. అది చాలా రెగ్యులర్‌ సైకిల్‌. అయినా కూడా ఆ సైకిల్‌ డ్యామేజీ కాలేదు. కాని కారు మాత్రం చాలా డ్యామేజీ అయ్యింది. కారు డ్యామేజీ అవ్వడంపై సదరు కారు తయారీ సంస్థ ఏదా అంటూ సెర్చ్‌ చేయడం మొదలు పెట్టారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు నెటిజన్స్‌ తెగ వెదికేస్తున్నారు. ఈ వింత యాక్సిడెంట్‌ మళ్లీ ఎప్పుడు ఎక్కడ జరగక పోవచ్చు.