భద్రాద్రిలో అధికారుల నిర్లక్ష్యం..ప్రసాదంగా వర్ధంతి భోజనం.. భక్తులు ఫైర్!

దక్షిణాది అయోధ్యగా భావించే భద్రాద్రి రాములవారి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది.అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎప్పుడు జరగని సంఘటన ఆలయ ప్రాంగణంలో జరగడంతో భద్రాద్రి రాములవారి భక్తులు అధికారులపై ఫైర్ అవుతున్నారు.

 Vardhanthi Meal In Bhadradri Rama Temple, Bhadrari Kothagudem, Bhadradri Sita Ra-TeluguStop.com

ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇంతకీ భద్రాద్రి రాములవారి ఆలయంలో జరిగిన అపచారం ఏమిటి?.

భద్రాద్రి రాములవారి ఆలయంలో ఒక వ్యక్తి వర్ధంతి భోజనం అంటూ అన్నప్రసాదాన్ని పెట్టడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎవరి కోసమో ఆలయ అధికారులు ఇలా ప్రవర్తించడాన్ని పురోహితులు కూడా తప్పు పడుతున్నారు.

అసలు ఇలా అన్న ప్రసాదాన్ని ఒక వ్యక్తి వర్ధంతి భోజనంగా ఎలా పెడతారని ఈ అపచారం చివరకు ఎటు దారి తీస్తుందో అని భక్తులు వాపోతున్నారు.

భద్రాద్రి శ్రీ సీతారాముల ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది.

దీని కోసం భక్తులు విరాళాలు కూడా ఇస్తుంటారు.అలంటి పవిత్రమైన అన్న ప్రసాద కార్యక్రమంలో మంగళవారం రోజు అపచారం చోటు చేసుకుంది.

అన్న ప్రసాద కార్యక్రమం జరిగే ప్రదేశం దగ్గర ఒక వ్యక్తి 50వ వర్ధంతి అనే ఫ్లెక్సీ కనిపించడంతో స్థానికులు అధికారులను ప్రశ్నించారు.

Telugu Bhadrachalam, Bhadradrisita, Vardhanthimeal-Latest News - Telugu

స్థానికులు గొడవ చేయడంతో అధికారులు ఫ్లెక్సి ని తొలగించారు.ఇప్పటి వరకు లక్షల రూపాయలు విరాళాలు ఇచ్చిన వారి ఫ్లెక్సీ కూడా ఆ ప్రాంగణంలో ఎప్పుడు పెట్టలేదు.కానీ ఇలా వర్ధంతి అనే ఫ్లెక్సీ అన్న ప్రసాద కార్యక్రమం జరిగే దగ్గర పెట్టడంతో భక్తులు అపచారంగా భావిస్తున్నారు.

ఎవరి కోసమో అధికారులు తమ ప్రతిభను పెంచుకోవడం కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో పవిత్రంగా భావించే అన్న ప్రసాద కార్యక్రమం దగ్గర ఇలా వర్ధంతి భోజనం అంటూ ఫ్లెక్సీ పెట్టడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

దీనికి కారణం అయినా అధికారులపైనా ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube