విషమంగా మారిన వరవరరావు ఆరోగ్యం,ఆసుపత్రిలోనే….  

Varavara rao condition is in critical, jail officials inform to his family , Varavararao, Varavararao Health Condition, Varavararao In Jail, Narendra Modi, Maharastra Governament, Virasam Chief Varavararao - Telugu Maharastra Governament, Narendra Modi, Varavararao, Varavararao Health Condition, Varavararao In Jail, Virasam Chief Varavararao

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తుంది.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమంగా మారినట్లు సమాచారం.

 Varavararao Varavararao Health Condition

గతేడాది భీమా కోరేగావ్ కేసు కు సంబంధించి మహారాష్ట్ర పోలీసులు వరవరరావు ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన జైలు లోనే ఉంటుండగా ఆయన అనారోగ్యం పాలయ్యారు.

దీనితో జైలు ఆసుపత్రిలోనే ఆయనకు చికిత్స అందిస్తుండగా ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఆయన భార్యకు ఫోన్ చేసి జైలు సిబ్బంది తెలిపినట్లు సమాచారం.

విషమంగా మారిన వరవరరావు ఆరోగ్యం,ఆసుపత్రిలోనే….-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టైన వరవరరావును మొదట మహారాష్ట్ర పుణె లోని ఎరవాడ జైలుకు తరలించారు.అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.

అయితే తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు చనిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం తో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.ఈ క్రమంలో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు.

అయినప్పటికీ కూడా బెయిల్ మాత్రం మంజూరు కాకపోవడం తో ఆయన తలోజా జైలు లోనే ఉంటున్నారు.అయితే ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడం తో జైలు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లు తెలుస్తుంది.తలొజా జైల్ నుండి ఆయన భార్యకు ఫోన్ చేసిన జైలు సిబ్బంది ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిపారు.

ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది.గత కొంతకాలంగా వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు.వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ANIA) కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం తో కోర్టు అతడి పిటీషన్ ను తిరస్కరించినట్లు తెలుస్తుంది.

#Varavararao #Narendra Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Varavararao Varavararao Health Condition Related Telugu News,Photos/Pics,Images..