విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం,పాఠశాల కు బిల్లు ఎంత వచ్చిందంటే!  

Varanasi School Slapped With 618 Crore Bill-varanasi Power Bill,varanasi School,vinayak Colony

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం గా ఒక పాఠశాల కుభారీ మొత్తం లో కరెంట్ బిల్లు వచ్చింది.ఆ బిల్లు చూడగానే పాఠశాల నిర్వాహకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.ఎవరూ కలలో కూడా ఇంత మొత్తంలో బిల్లు వస్తుంది అంటే మాత్రం ఎవరైనా కూలబడిపోవాల్సిందే.

Varanasi School Slapped With 618 Crore Bill-varanasi Power Bill,varanasi School,vinayak Colony-Varanasi School Slapped With 618 Crore Bill-Varanasi Power Bill Varanasi Vinayak Colony

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో నరేంద్ర మోడీ ఇలాకా అయినా వారణాసి లో.వారణాసి లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఒక పాఠశాల కు ఏకంగా రూ.

Varanasi School Slapped With 618 Crore Bill-varanasi Power Bill,varanasi School,vinayak Colony-Varanasi School Slapped With 618 Crore Bill-Varanasi Power Bill Varanasi Vinayak Colony

618 కోట్ల విద్యుత్ బిల్లు రావడం విశేషం.ఈ బిల్లును చూసి ఒక్కసారిగా ఖంగుతిన్న యాజమాన్యం కళ్ళు బైర్లు కమ్మాయి.వారణాసి లోని వినాయక్ కాలనీ లో ఈ ఘటన చోటుచేసుకోగా,ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ భారీ బిల్లు గురించి స్కూల్ యాజమాన్యం విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా.

వారు తగిన చర్యలు తీసుకోలేదని పాఠశాల నిర్వాహకులు వాపోతున్నారు.సాఫ్ట్‌వేర్ సమస్య అని తెలిసి కూడా అధికారులు ఈ నెల 7లోగా తమను బిల్లు కట్టమన్నారని.లేకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరించినట్లు పాఠశాల యాజమాన్యం చెబుతుంది.గతంలో కూడా పలుమార్లు ఇలాగే బిల్లులు తప్పుగా వచ్చాయని,అప్పుడు అధికారుల ద్రుష్టి తీసుకెళ్లగా అధికారులు చర్యలు తీసుకున్నట్లు స్కూల్ నిర్వాహకులు వెల్లడించారు.అయితే ఈ సారి ఈ తాజా బిల్లు పై అధికారులు ఏమేరకు స్పందించి చర్యలు తీసుకుంటారో అన్న విషయం తెలియాల్సి ఉంది.