పెళ్లిపై ఘాటుగా స్పందించిన వరలక్ష్మి.. ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు నటిగా వరలక్ష్మికి మంచిపేరును తెచ్చిపెట్టాయి.వరలక్ష్మి కీలక పాత్రల్లో నటించిన క్రాక్, నాంది సినిమాలు సక్సెస్ కావడంతో ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

 Varalaxmi Sharat Kumar Reaction About Marriage-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో సైతం వరలక్ష్మికి ఛాన్స్ దక్కినట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

తమిళంలో ఇప్పటికే నటిగా ప్రూవ్ చేసుకున్న వరలక్ష్మి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుతంగా నటిస్తున్నారు.

 Varalaxmi Sharat Kumar Reaction About Marriage-పెళ్లిపై ఘాటుగా స్పందించిన వరలక్ష్మి.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వరలక్ష్మి హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఏమైందో తెలీదు కానీ వరలక్ష్మి విశాల్ కు దూరమయ్యారు.

వరలక్ష్మి విశాల్ విడిపోయారని వార్తలు వచ్చినా ఆ వార్తల గురించి ఆమె స్పందించలేదు.అయితే తాజాగా చెన్నైలోని ఒక ఫేమస్ హాస్పిటల్ నిర్వహించిన స్వచ్చంద కార్యక్రమాన్ని వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రారంభించారు.

అయితే ఈ స్వచ్చంద కార్యక్రమం గురించి ప్రెస్ మీట్ లో వరలక్ష్మి మాట్లాడుతున్న తరుణంలో జర్నలిస్టుల నుంచి వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. స్వచ్చంద కార్యక్రమం కోసం వస్తే పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవడంతో ఫైర్ అయ్యారు.పెళ్లి గురించి ఎలాంటి ప్లేస్ లో అడుగుతున్నారని.ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగవద్దని ఆమె అన్నారు.

ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమం జరుగుతోందని. పెళ్లి గురించి అడిగే వేదికలు చాలా ఉన్నాయని.

ఆ వేదికలలో అడగండని వరలక్ష్మి తెలిపారు.తమిళంలో వరలక్ష్మి చేతిలో ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు ఉన్నట్టు తెలుస్తోంది.

కొందరు నెటిజన్లు మాత్రం ప్రేమ, పెళ్లి విషయాలకు సంబంధించిన ప్రశ్నలు వరలక్ష్మిని హర్ట్ చేయడం వల్లే ఆమె అలా స్పందించారని అభిప్రాయపడుతున్నారు.

#VaralaxmiSharat #VaralaxmiSharat #VaralaxmiSharat #Famous Hospital #VaralaxmiSharat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు