క్రాక్, నాంది సక్సెస్ కావడానికి కారణం ఆమేనా..?

2021 సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీకి కలిసొచ్చింది.చాలా సంవత్సరాల నుంచి సరైన హిట్లు లేని హీరోలకు ఈ ఏడాది విజయాలు దక్కుతున్నాయి.రాజా ది గ్రేట్ తరువాత సరైన సక్సెస్ లేని రవితేజ, సుడిగాడు మూవీ తరువాత సరైన హిట్ లేని అల్లరి నరేష్ లకు ఈ ఏడాది క్రాక్, నాంది సినిమాలు విజయాలను అందించాయి.50 శాతం ఆక్యుపెన్సీతో క్రాక్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగా నాంది ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు భారీ కలెక్షన్లను సాధిస్తోంది.

 Varalaxmi Sharat Kumar Gave Success To Flop Heroes-TeluguStop.com

అయితే ఈ రెండు సినిమాలలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన సంగతి తెలిసిందే.క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించిన వరలక్ష్మి నాంది సినిమాలో మాత్రం లాయర్ గా నటించారు.

ఈ రెండు సినిమాల్లో వరలక్ష్మి పోషించిన పాత్రలకు మంచి పేరు రావడంతో పాటు వరలక్ష్మి అద్భుతంగా నటించిందంటూ ప్రశంసలు వ్యక్తమయ్యాయి.దీంతో ఫ్లాప్ హీరోల సినిమాల్లో వరలక్ష్మి నటిస్తే హిట్ అవుతుందంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

 Varalaxmi Sharat Kumar Gave Success To Flop Heroes-క్రాక్, నాంది సక్సెస్ కావడానికి కారణం ఆమేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీని విజయ్ సేతుపతి తరువాత వరలక్ష్మి ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు.దర్శకనిర్మాతలు సైతం వరలక్ష్మికి తమ సినిమాల్లో అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.

తెనాలి రామకృష్ణ సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ మొదలుపెట్టిన వరలక్ష్మీ శరత్ కుమార్ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నారు.సందీప్ మూవీలో వరలక్ష్మి పోలీస్ గా నటించనున్నారు.

Telugu Flop Heroes, Gave Success, Krack, Nandhi Movies, Varalaxmi Sarat Kumar-Movie

స్టార్ హీరోల సినిమాల్లో కూడా వరలక్ష్మికి వరుస ఆఫర్లు వస్తే ఆమె కెరీర్ టర్న్ అయినట్లే అని చెప్పాలి.తెలుగులో వరలక్ష్మి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండటం గమనార్హం.ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా క్రాక్, నాంది సక్సెస్ కు వరలక్ష్మి కారణమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

#Krack #Nandhi Movies #Gave Success #VaralaxmiSarat #Flop Heroes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు